Advertisement

  • 160 మిలియన్ మార్క్‌ను దాటిన ‘నీలి నీలి ఆకాశం’ పాట

160 మిలియన్ మార్క్‌ను దాటిన ‘నీలి నీలి ఆకాశం’ పాట

By: chandrasekar Fri, 07 Aug 2020 3:39 PM

160 మిలియన్ మార్క్‌ను దాటిన ‘నీలి నీలి ఆకాశం’ పాట


అనూప్ రూబెన్స్ చేత సంగీతం సమకూర్చబడిన ‘30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?’ సినిమాలోని హిట్ ఐన పాట ‘నీలి నీలి ఆకాశం’ సోషల్ మీడియాలో 160 మిలియన్ మార్క్‌ను దాటింది.

బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా రూపొందిన ‘30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?’ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం’ పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

యూట్యూబ్‌లో విడుదల చేసిన ఈ పాట ఫుల్ వీడియోను జనాలు ఎగబడి చూసారు మరియు ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. ఈ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 100 మిలియన్ (10 కోట్ల) వ్యూస్‌ క్రాస్ చేసిన ఈ పాపులర్ సాంగ్ ఇప్పటికి 16 కోట్ల మంది ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. గురువారం ఈ సాంగ్ 160 మిలియన్ మార్క్‌ను దాటింది. 200 మిలియన్ వ్యూస్ వైపు దూసుకెళ్తోంది.

నిజానికి ప్రదీప్‌కు హీరోగా ఇదే తొలి చిత్రం విశేషం. ఒక చిన్న హీరో సినిమాలో పాట ఈ స్థాయిలో ఆదరణపొందడం గొప్ప విషయం. స్టార్ హీరోల పాటలతో సమానంగా ఈ పాట దూసుకెళ్తోంది. దీనికి ప్రధాన కారణం సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ గాయనీగాయకులు సిద్ శ్రీరామ్, సునీత. ఈ సినిమాకు చంద్రబోస్ అందించిన సాహిత్యం మరో అద్భుతం. ఈ సినిమాలోని పాటన్నింటినీ ఆయనే రాశారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ద‌గ్గర ‘ఆర్య 2’, ‘1 నేనొక్కడినే’ చిత్రాల‌కు ప‌నిచేసిన మున్నా ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఎస్వీ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై క‌న్నడ చిత్రసీమ‌లో విజ‌య‌వంత‌మైన నిర్మాత‌గా పేరుపొందిన ఎస్వీ బాబు నిర్మించారు.

సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయింది మరియు విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా కారణంగా మూతబడ్డ థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాను జీఏ2, యువి క్రియేష‌న్స్ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నాయి. సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీని సంపాదిందించిన ఈ సినిమా విడుదల తరువాత మంచి హిట్ కొడుతుందని ఆశిస్తాం.

Tags :
|

Advertisement