Advertisement

  • ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం రెండు నెలలు వాయిదా

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం రెండు నెలలు వాయిదా

By: chandrasekar Wed, 17 June 2020 3:04 PM

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం రెండు నెలలు వాయిదా


ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ నటీనటులకైతే జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటుంటారు. సినీ ప్రపంచంలోనే అత్యున్నత అవార్డుగా భావించే అకాడమీ అవార్డులను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లో యివ్వడం ఆనవాయితీ.

2021లో జరగనున్న ఈ అవార్డు వేడుకలను కరోనా మహామ్మారి కారణంగా రెండు నెలలు పాటు వాయిదా వేశారు. నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ 25న అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం జరపబోతున్నట్టు ఆస్కార్ అవార్డుల కమిటీ వెల్లడించింది. ఆస్కార్ అవార్డు ప్రారంభమైన 92 యేళ్లలో ఈ వేడుక ఇలా వాయిదా పడటం ఇదే మొదటిసారి. 93వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవాన్ని 8 వారాల పాటు వాయిదా వేసారు.

ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడే చిత్రాల అర్హత తేదిలను కూడా ఎక్స్‌డెంట్ చేస్తున్నట్టు ఆస్కార్ కమిటీ తెలిపింది. ఇప్పటికే హాలీవుడ్‌తో పాటు పలు దేశాల్లో కరోనా కారణంగా చిత్రాల విడుదల చేయలేక వాయిదా పడ్డాయి. ఈ కారణంగానే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని కూడా కొన్ని వారాల పాటు వాయిదా వేయాల్సివచ్చిందని అకాడమీ అవార్డుల ప్రెసిడెంట్ డేవిడ్ రూబెన్ తెలియజేసారు.

ఐతే కొన్ని చిత్రాలను మాత్రం డైరెక్ట్‌గా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేస్తున్నారు. అలా రిలీజ్ చేసిన వాటిని ఆస్కార్ అవార్డుల కమిటీ పరిగణలోకి తీసుకునే అవకాశాలున్నాయి. ప్రతియేటా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కరోనా విలయ తాండవం చేస్తోంది. దీంతో వేరే చోటికి ఈ అవార్డుల కార్యక్రమాన్ని తరలిస్తారా అనేది చూడాలి. మొత్తంగా కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాటిలో చిత్ర పరిశ్రమ ముందు వరుసలో ఉంది. గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఇన్ని రోజులు థియేటర్స్ బంద్ కారణంగా సినిమాలు వాయిదా పడ్డ దాఖలాలు మాత్రం లేవు.

Tags :
|
|

Advertisement