Advertisement

  • మారుతి, గోపీచంద్ కాంబినేషన్ తో తర్వాతి సినిమా

మారుతి, గోపీచంద్ కాంబినేషన్ తో తర్వాతి సినిమా

By: chandrasekar Mon, 20 July 2020 6:23 PM

మారుతి, గోపీచంద్ కాంబినేషన్ తో తర్వాతి సినిమా


హిట్ ఇచ్చినా ఫ్లాప్ ఇచ్చినా కూడా కొందరు దర్శకులు మాత్రం హీరోల వెంట పడరు. కథలు రాసుకుని దానికి తగ్గట్లు హీరోలను ఎంచుకుంటారు. అలాగే హీరోల కోసం కథలు రాయమన్నా కూడా రాస్తుంటారు. అలాంటి దర్శకుల్లో మారుతి కూడా ఉంటాడు. ప్రతిరోజూ పండగే లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈయన ఏ హీరోతో సినిమా చేస్తాడో అనే ఆసక్తి చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

ఇప్పటి వరకు తన తర్వాతి సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు ఈ దర్శకుడు. కానీ లాక్‌డౌన్‌లో మాత్రం మంచి కథ ఒకటి సిద్ధం చేసుకున్నాడు మారుతి. దానికి సంబంధించి స్క్రీన్ ప్లే కూడా పూర్తయిందని చెప్పుకొచ్చాడు. ఎప్పటికప్పుడు భిన్నమైన కథలు రాసుకునే మారుతి. ప్రతిరోజూ పండగేతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఈ సారి కూడా పూర్తిగా కొత్త కథతోనే రాబోతున్నాడు ఈయన. అయితే ఇందులో హీరో ఎవరో మాత్రం చెప్పలేదు మారుతి.

ఎవరూ ఊహించని విధంగా గోపీచంద్ వైపు అడుగేస్తున్నాడు ఈ దర్శకుడు. గోపీచంద్‌తో సినిమానా అంటూ అంతా షాక్ అవుతున్నారు కానీ నిజంగానే మారుతి మాత్రం తాను రాసుకున్న కథ ఆ హీరోకే సరిపోతుందని భావిస్తున్నాడు. అందుకే ఈ హీరో వైపు చూస్తున్నాడు మారుతి. త్వరలోనే ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు ప్రకటిస్తానని చెప్పాడు మారుతి.

Tags :
|
|
|

Advertisement