Advertisement

కాజల్‌ పెళ్లాడబోతోన్న వ్యక్తి పేరు...?

By: chandrasekar Tue, 06 Oct 2020 5:54 PM

కాజల్‌ పెళ్లాడబోతోన్న వ్యక్తి పేరు...?


హీరోయిన్‌ కాజల్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అని సమాచారం. ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు ఇప్పటికే వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కాజల్‌ అగర్వాల్‌ ముంబైకి చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌, వ్యాపారవేత్తను‌ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి.

తాజాగా కాజల్‌ పెళ్లాడబోతోన్న వ్యక్తి పేరు కూడా బయటికి వచ్చేసింది. ఇంటీరియర్‌ డిజైనర్‌, వ్యాపారవేత్త అయిన గౌతమ్‌ కిచ్లుని కాజల్‌ వివాహం చేసుకోనుందని, ఇప్పటికే అతనితో నిశ్చితార్థం కూడా ఆయిందని తాజాగా వార్తలు బయటికి వచ్చాయి.

ముంబైలో వీరి వివాహం జరగనుందని వార్తలు షికార్లు కొడుతున్నాయి. అయితే ఇంతకు ముందు ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఎలా అయితే కామ్‌గా ఉందో ఇప్పుడు కూడా కాజల్‌ సైలెంట్‌గానే ఉండటం విశేషం. ప్రస్తుతం కాజల్ స్టార్‌ హీరోలైన కమల్‌ హాసన్‌, చిరంజీవి వంటి వారి సరసన నటిస్తోంది.

Tags :
|
|

Advertisement