Advertisement

  • వకీల్ సాబ్ చిత్ర బృందం మోషన్ పోస్టర్ విడుదలకి సన్నాహాలు

వకీల్ సాబ్ చిత్ర బృందం మోషన్ పోస్టర్ విడుదలకి సన్నాహాలు

By: chandrasekar Sat, 29 Aug 2020 12:13 PM

వకీల్ సాబ్ చిత్ర బృందం మోషన్ పోస్టర్ విడుదలకి సన్నాహాలు


అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ టీజర్ సెప్టెంబర్ లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. మార్చ్ నెలలో విడుదలైన మగువా మగువా సాంగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర బృందం మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తోందని టాక్ వస్తోంది.

ఎంతో కాలంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ వకీల్ సాబ్ టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుండటంతో ఈ మోషన్ పోస్టర్‌ని వారి అంచనాలకు తగినట్టుగా టీజర్‌ ట్రీట్‌కి సమానంగా ఉండేలా డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ కూడా తన ట్విట్ట్వర్‌లో “WED-NES-DAY” అని ట్వీట్ చేసి అభిమానులకు ఒక క్లూ ఇచ్చాడు.

బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ అయిన ‘పింక్’ చిత్రానికి రీమేక్ ఈ వకీల్ సాబ్ సినిమా అనే సంగతి తెలిసిందే. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ న్యాయవాది పాత్ర పోషిస్తున్నాడు. ఎంసీఏ మూవీ ఫేం వేణు శ్రీరామ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా, దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల నటిస్తున్నారు.

Tags :

Advertisement