Advertisement

  • కెమెరా ముందు నటించడంలో ఉండే ఆనందం మాత్రం మారలేదు: రెజీనా

కెమెరా ముందు నటించడంలో ఉండే ఆనందం మాత్రం మారలేదు: రెజీనా

By: chandrasekar Mon, 17 Aug 2020 7:54 PM

కెమెరా ముందు నటించడంలో ఉండే ఆనందం మాత్రం మారలేదు: రెజీనా


తన సినీ ప్రయాణంలోని మధురజ్ఞాపకాల్ని గురించి రెజీనా ముచ్చటిస్తూ ‘పద్నాలుగేళ్ల వయసులో ‘కందనాల్ ముదల్' సినిమాతో నా నటజీవితం ఆరంభమైంది. తొలి సినిమా అనగానే కెమెరా ముందు ఎలా నటించాలో తెలియక చాలా మంది భయపడుతుంటారు. నేను మాత్రం ఎంతో ఉత్సుకతతో సెట్స్ లో అడుగుపెట్టా. ఆ సమయంలో నాపై ఎలాంటి బాధ్యతలు లేకపోవడంతో ఆనందంగా నటించా. నా ధైర్యాన్ని చూసి యూనిట్ లో అందరూ ఆశ్చర్యపోయారు. తొలి సినిమా చేస్తున్నప్పుడు భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించలేదు.

అనుభవం సంపాదించుకున్న కొద్ది బాధ్యతలు పెరుగుతూ వచ్చాయి. అయితే కెమెరా ముందు నటించడంలో ఉండే ఆనందం మాత్రం మారలేదు. మూసధోరణితో కూడిన పాత్రల కంటే ప్రయోగాలు ఫలించినప్పుడు లభించే సంతృప్తి ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. హిందీలో అరంగేట్ర చిత్రంలో లెస్బియన్ గా నటించా. చాలా మంది తొలి సినిమా కోసం అలాంటి పాత్రను ఎందుకు ఎంచుకున్నావని విమర్శించారు. లెస్బియన్స్ సమస్యను గురించి చర్చించడం ఆవసరం అనిపించింది. చిన్న పాత్రే అయినా ఎంతో మంది జీవితాల్ని ప్రతిభావితం చేసింది'. అని తెలిపింది.

Tags :
|

Advertisement