Advertisement

ఓటీటీలో హిట్టైన సినిమా ఇప్పుడు ఈ-టీవీ లో

By: chandrasekar Fri, 04 Sept 2020 8:27 PM

ఓటీటీలో హిట్టైన సినిమా ఇప్పుడు ఈ-టీవీ లో


కరోనా వల్ల దాదాపు అన్ని సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఇంతకుమునుపు బాగా హిట్టైన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమా ఇప్పుడు ఈ-టీవిలో రానుంది. సత్యదేవ్ హీరోగా కంచరపాలేం ఫేమ్ వెంకటేశ్ మహా దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్స్ విడుదలకాకుండా డైరెక్ట్’గా ప్రముఖ ఓటీటీ అయినా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమాకు భారీగా వ్యూస్‌ వస్తున్నాయి.

మంచి రివ్యూ తెచ్చుకున్న ఈ సినిమాలో ఉమా మహేశ్వర రావు పాత్రలో యువ నటుడు సత్యదేవ్‌ తన విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్నాడు. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఎంతో పాపులర్ అయినా వెంకటేష్‌ మహా దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పాడ్డాయి. అయితే ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఆకట్టుకుంటూ డిజిటల్‌ లో భారీగా వ్యూస్‌‌ను రాబడుతోంది. అది అలా ఉంటే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమా శాటిలైట్‌ రైట్స్‌ను ఈ టీవీ కొనుగోలు చేసింది.

దాదాపు అన్ని శాటిలైట్‌ రైట్స్ విషయంలో జెమినీ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి ఛానల్స్ పోటి పడి కొంటాయి. ఇప్పుడేమో ఈ సినిమాను ఈటీవీ మంచి ధర చెల్లించి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య శాటిలైట్స్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ టీవీ యాజమాన్యం ఈ సినిమా శాటిలైట్‌ హక్కులను దాదాపు 2.5 కోట్లకు కొన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా ఈటీవీలో ప్రసారం కానుంది. అయితే ఇక్కడ విషయం ఏమంటే ఈ సినిమా మొత్తం బడ్జెట్ రెండు కోట్లు కూడా కాలేదట. చిన్న బడ్జెట్ సినిమాలు కూడా మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి అనడానికి ఇది మంచి ఉదాహరణ.

అందరూ ఎదురుచూస్తున్న ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈటీవీలో సెప్టెంబర్ 13 వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కానుంది. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమా ఓ మలయాళ సినిమాకు రీమేక్. మలయాళంలో ఘనవిజయం సాధించిన మహేశింతే ప్రతీకారమ్‌ అనే ఈ సినిమాను తెలుగులో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య పేరుతో రీమేక్ చేశారు. అక్కడ ప్రధాన పాత్రలో ఫాహిద్ ఫాజిల్ నటించాడు. ఇక ఈ సినిమాను తెలుగులో ఆర్కా మీడియా వర్క్స్‌, మహాయణ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థలు కలిసి నిర్మించాయి. సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో నటించగా ఇతర ముఖ్య పాత్రల్లో సీనియర్‌ నరేష్, సుహాస్‌, జబర్థస్త్‌ రామ్‌ ప్రసాద్‌ నటించారు. ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణ పొందిన ఈ సినిమా మళ్ళీ చూడటానికి అందరూ ఎదురు చూస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement