Advertisement

  • ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన సీత పాత్రలో నటించనున్నహీరోయిన్

ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన సీత పాత్రలో నటించనున్నహీరోయిన్

By: chandrasekar Sat, 17 Oct 2020 09:56 AM

ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన సీత పాత్రలో నటించనున్నహీరోయిన్


ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన సీత పాత్రలో హీరోయిన్ ఇంకా ఎవరని ప్రకటించక పోవడం వల్ల అభిమానుల మధ్య ఉత్కంఠ ఏర్పరుస్తూవుంది. ప్రభాస్ బర్త్ డే డేట్ సమీపిస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తుండగా ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేయనున్నాడు. ప్రభాస్ బర్త్ డే సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయన అభిమానులకు ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా తమ చిత్రాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు లేదా పోస్టర్స్ విడుదల చేసేందుకు మూడు చిత్రాలకు సంబంధించిన దర్శకులు, చిత్ర నిర్మాణ సంస్థలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇదిలావుంటే, ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో తెరకెక్కనున్న ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించబోయే హీరోయిన్ ఎవరనే ప్రశ్న కేవలం ప్రభాస్ ఫ్యాన్స్‌లోనే కాదు ఆదిపురుష్ మూవీతో మరో దృశ్య కావ్యాన్ని ఎంజాయ్ చేయవచ్చని భావిస్తున్న ఆడియెన్స్ అందరిలోనూ ఉంది.

బాహుబలి హీరో ప్రభాస్ పుట్టిన రోజు ఈ నెల 23న సందర్భంగా ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించబోయే హీరోయిన్ వివరాలు వెల్లడించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఆదిపురుష్ మూవీలో సీత పాత్ర కోసం పలువురు హీరోయిన్స్ పేర్లు పరిశీలిస్తున్నట్టు ఎప్పటికప్పుడు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది హీరోయిన్స్ పేర్లు వినిపించగా తాజాగా ఆ జాబితాలో కృతిసనన్ పేరు వినిపిస్తోంది. కృతి సనన్ 2014లో మహేష్ బాబు సరసన 1 నేనొక్కడినే చిత్రం ద్వారా తొలిసారి హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాతి ఏడాది నాగచైతన్యతో దోచేయ్ మూవీ చేసింది. ఆ తర్వాత గత ఐదేళ్లుగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ అక్కడే బిజీ అయ్యిందీ ఢిల్లీ బ్యూటీ. ప్రభాస్ బర్త్ డే రోజు కృతి సనన్ ఎంపికపై ఆదిపురుష్ మేకర్స్ ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు బాలీవుడ్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంతమేరకు నిజం ఉందో తెలియాలంటే ప్రభాస్ బర్త్ డే వరకు వేచిచూడాల్సిందే. దీనిపై అందరూ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Tags :

Advertisement