Advertisement

  • రాశీ ఖన్నాతో ఎదురైన అనుభవాన్ని వెల్లడించిన హీరోయిన్ శ్రీ రాపాకా

రాశీ ఖన్నాతో ఎదురైన అనుభవాన్ని వెల్లడించిన హీరోయిన్ శ్రీ రాపాకా

By: chandrasekar Sat, 04 July 2020 1:36 PM

రాశీ ఖన్నాతో ఎదురైన అనుభవాన్ని వెల్లడించిన  హీరోయిన్ శ్రీ రాపాకా


శ్రీ రాపాకా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘నగ్నం’ సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఈ సినిమాలో బోల్డ్‌గా నటించిన అందరి దృష్టిని ఆకర్షించింది కథానాయిక స్వీటీ. ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాల్లో ఈమె ఎలాంటి మొహమాటం లేకుండా నటించి ఔరా అనిపించింది. ఈ సినిమాను శ్రీ‌తో ఆర్జీవి కెేవలం రెండు రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం. రామ్ గోపాల్ వర్మ స్వీటీగా పరిచయం చేసిన ఈమె అసలు పేరు శ్రీ రాపాక. అంతేకాదు ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు ఆమెకు రూ. 2లక్షల రెమ్యుునరేషన్ అందుకుంది.

ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఎంతో మంది స్టార్ హీరోలతో కలసి పనిచేసినట్టు పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. ఇప్పటికే బాలయ్య సహా పలువురు హీరోలు తనతో ప్రవర్తించిన విధానాన్ని వెల్లడించిన శ్రీ రాపాకా తాజాగా హీరోయిన్ రాశీ ఖన్నాతో తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించింది. రాశీ ఖన్నా, సాయి ధరమ్ తేజ్‌తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సుప్రీమ్’ సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రానికి శ్రీ రాపాకా కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిందట.

ఈ సందర్భంగా ఓసారి చీర కట్టుకోవడం కోసం హీరోయిన్ రాశీ ఖన్నాను తనను పిలిపించిందట. నిజానికి నేను వెళ్లాల్సిన పనిలేదు. కానీ కాస్ట్యూమ్ డిజైనర్‌తో చీర కట్టించుకుంటానని చెప్పిందట. దాంతో నేను సెట్‌కి వెళ్లాను. ఆమె కేరవాన్ బయట నన్ను ఆమె చాలా సేపు వెయిట్ చేయించిందట. ఎంతో సేపటికీ కానీ ఆమె బయటకు రాలేదు. ఈ సందర్భంగా రాశీఖన్నాతో తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించింది.

Tags :

Advertisement