Advertisement

  • ట్విట్టర్లో ‘బాయ్కాట్ కంగనా’ అనే హ్యాష్ట్యాగ్

ట్విట్టర్లో ‘బాయ్కాట్ కంగనా’ అనే హ్యాష్ట్యాగ్

By: chandrasekar Wed, 26 Aug 2020 12:25 PM

ట్విట్టర్లో ‘బాయ్కాట్ కంగనా’ అనే హ్యాష్ట్యాగ్


కంగనారనౌత్‌.. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఉదంతం తర్వాత బాలీవుడ్‌ పెద్దల మాఫియాపై యుద్ధం ప్రకటించింది. బాలీవుడ్‌ చిత్రసీమలోని బంధుప్రీతి, వ్యవస్థీకృత పెత్తనంపై పలు వేదికలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ కారణాల వల్ల పరిశ్రమలోని ఓ వర్గం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా ట్విట్టర్‌లో ‘బాయ్‌కాట్‌ కంగనా’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. దీనిపై కంగనరనౌత్‌ తనదైన శైలిలో స్పందించింది.

‘ఇలాంటి దుష్ప్రచారాలన్నీ బాలీవుడ్‌ మాఫియానే చేస్తుంది. నన్ను నైతికంగా దెబ్బతీసేందుకే కొందరు పెద్దలు ఈ ఎత్తుగడలు వేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే కలుగులోంచి ఎలుకలు మెల్లగా బయటకు వస్తున్నాయనిపిస్తోంది. నా ప్రతిష్టను దెబ్బతీయడానికి బాలీవుడ్‌ మాఫియా అన్ని ప్రయత్నాలు చేస్తోంది’ అంటూ ట్విట్టర్‌లో కంగనారనౌత్ తెలిపింది‌.

తన ట్విట్టర్‌ ఖాతాను కూడా నిలిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపణలు చేసింది. బాలీవుడ్‌ ఇండస్ట్రీలో కంగనారనౌత్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

Tags :

Advertisement