Advertisement

  • 'హ్యాపీబర్త్ డే మహేష్' ట్యాగ్ 24 గంటల్లో 31.1 మిలియన్ ల ట్వీట్స్ ‌తో రికార్డ్

'హ్యాపీబర్త్ డే మహేష్' ట్యాగ్ 24 గంటల్లో 31.1 మిలియన్ ల ట్వీట్స్ ‌తో రికార్డ్

By: chandrasekar Mon, 27 July 2020 10:44 PM

'హ్యాపీబర్త్ డే మహేష్' ట్యాగ్ 24 గంటల్లో 31.1 మిలియన్ ల ట్వీట్స్ ‌తో రికార్డ్


సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డేకు కొద్ది రోజులు మాత్రమే ఉంది. దాంతో మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఇప్పటికే మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా కామన్ డీపీ విడుదల చేశారు. ఆ సీడీపీలో ఒక వైపు ఛార్మినార్ మరో వైపు కర్నూలు కొండారెడ్డి బురుజు ఉండగా ఆ పిల్లర్‌ను ఆనుకుని వైట్ అండ్ వైట్ సూట్‌లో మహేష్ బాబు స్టైల్‌‌గా నిలబడి ఉన్న ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అంటూ సంక్రాంతి వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఆయన పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వాటి పాట సినిమాకు ఓకే చెప్పిన మహేష్ దానికి సంబందించిన ఫస్టు లుక్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే. అది అలా ఉంటే ఆయన వచ్చే నెల తొమ్మిదిన పుట్టినరోజు జరుపుకోనున్నారు.

హ్యాపీబర్త్ డే మహేష్ అనే హ్యాష్ ట్యాగ్ 24 గంటల్లో 31.1 మిలియన్ ల ట్వీట్స్ ‌తో రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు ఇండియా ఇంత మొత్తంలో ఇంత భారీ స్థాయిలో ఏదీ ట్రెండ్ అవ్వలేదు. ఓ 24 గంటల్లో మూడు కోట్ల ట్వీట్స్ నమోదు అవ్వడం ఇండియన్ సెలబ్రెటీ చరిత్రలో ఫస్ట్ టైం అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా గౌరవంగా చెప్పుకుంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ 2.7 కోట్ల ట్వీట్లతో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ రికార్డు కొద్ది కాలంలోనే తుడిచిపెట్టుకుపోయింది.

'హ్యాపీ బర్త్ డే మహేశ్' అనే హ్యాష్ ట్యాగ్ ఇది 3 కోట్ల ట్వీట్స్ ను దాటేసి, ఇండియాలోనే బిగ్గెస్ట్ ట్రెండ్ ను క్రియేట్ చేసింది. దీంతో ఇప్పుడు మహేశ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఆగస్టు 9న ఇంకెంతగా ట్రెండ్ చేసి ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనున్నారో అని చర్చించుకుంటున్నారు నెటిజన్స్. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే ఆయన పరశురామ్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబందించిన స్క్రిప్ట్ పనుల్లో రాజమౌళి ఉన్నారు.

ప్రస్తుతం కరోనా కారణంగా రాజమౌళి ఇంట్లో ఖాలీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన మహేష్ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ పనులు చూస్తున్నారట. అంతేకాదు ఈ కరోనా వల్ల ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఎప్పుడు మొదలుకానుందో తెలియకపోవడంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్ వదిలి నల్గొండ జిల్లాలోని తన ఫామ్ హౌజ్‌కు వెళ్లారట. ఇక అక్కడే ఓ నెల రోజుల పాటు ఉంటూ ఫ్యామిలీతో గడపనున్నాడు.

Tags :

Advertisement