Advertisement

  • డబ్బింగ్ ప్రారంభించిన ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిశోర్‌

డబ్బింగ్ ప్రారంభించిన ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిశోర్‌

By: chandrasekar Mon, 15 June 2020 2:21 PM

డబ్బింగ్ ప్రారంభించిన ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిశోర్‌


భార‌త్‌లోనూ లాక్‌డౌన్‌తో చాలా సినిమాల షూటింగ్‌ల‌పై ప్ర‌భావం ప‌డింది. చాలా సినిమాల విడుద‌ల తేదీలు వాయిదా ప‌డ్డాయి. మ‌రికొన్ని ఎప్పుడు విడుద‌ల‌వుతాయో కూడా తెలియ‌దు.

కరోనా వ్యాప్తి నియంత్రణకు లాక్‌డౌన్‌ విధించడంతో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. దీంతో సినీ, టీవీ నటులు ఇండ్లకే పరిమితమయ్యారు. ఇంటి పని, వంట పని, వ్యాయామాలు చేస్తూ ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసి తమ అభిమానులకు దగ్గరవుతున్నారు.

ప్రస్తుతం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా షూటింగ్‌లకు అనుమతివ్వడంతో కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్‌ పనులు మొదలు పెడుతున్నారు. దీనిలో భాగంగా ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిశోర్‌ డబ్బింగ్ ప్రారంభించారు. దీనికి సంబంధిచిన ఫన్నీ వీడియోను సోషల్‌ మిడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో డబ్బింగ్‌ చెప్పడానికి ముందే రికార్డింగ్‌ మైక్‌, పక్కన పరిసరాలను శానిటైజ్‌ చేశారు. దీనికి డబ్బింగ్‌ ముందే స్ప్రే చేసుకోండి లబ్‌ డబ్‌ లబ్‌ డబ్‌ లబ్‌ డబ్బింగ్ బిక్కబిక్కు జీవితం అంటూ క్యాఫ్షన్‌ ఇచ్చారు.

Tags :
|

Advertisement