Advertisement

రష్మిక కలల‌పై ‘లాక్ డౌన్’ ప్రభావం

By: Sankar Wed, 20 May 2020 4:02 PM

రష్మిక కలల‌పై ‘లాక్ డౌన్’ ప్రభావం


ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రష్మిక విజయ పరంపర కొనసాగుతూ కన్పిస్తుంది. ఏ ఇండస్ట్రీలో అయినా కెరీర్ లో ఎదుగుతున్న రష్మిక క్రేజ్ మాములుగా లేదు. కరోనా లాక్ డౌన్ కారణంగా రష్మిక ఇంటికే పరిమితంఅయ్యింది. ఫ్యూచర్‌ సినిమాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రష్మిక షూటింగ్స్‌ మిస్‌అవుతున్నట్టు ఫీల్‌ అవుతుంది.

కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన రష్మిక డ్రీం కు బ్రేకులు పడ్డట్లే ఉందట. ఎందుకంటే ఈ కన్నడ బ్యూటీ.. ఫ్యూచర్ సినిమాల ఫై ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ కల ఈ ఏడాది తీర్చేసుకొందామని అనుకుందట. అందుకు తగ్గట్టే ‘భీష్మ’, ‘సరిలేరు నీకెవ్వరు’ విజయాలతో పరిస్థితులు కలిసొచ్చాయట. ఇంతలో మహమ్మారిలా దూసుకొచ్చిన కరోనా రష్మిక కోరికలపై నీళ్లు చల్లేసింది.

rashmika,lockdown,effect,tollywood,corona ,రష్మిక, లాక్ డౌన్, కలల‌పై, టాలీవుడ్, కరోనా


ఇక రష్మిక డ్రీమ్ ఏంటంటే.. రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవాలని.. ప్రస్తుతం హిట్ల తర్వాత జోష్ లో ఉన్న రష్మిక రెండు భారీ సినిమాలకు సంతకాలు చేసింది. అందులో ఒకటి అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘పుష్ప’.. కాగా తమిళంలో కార్తీ సరసన మరో సినిమా. లాక్ డౌన్ లో ఉన్న రష్మిక ఇంట్లో ఉండి ఏం చేయట్లేదట.. కానీ షూటింగ్స్ బాగా మిస్ అవుతున్నాను అంటుందట ఈ బ్యూటీ.

Tags :
|

Advertisement