Advertisement

  • తెలుగు బిగ్బాస్ సీజన్-4లో పాల్గొంటున్నట్లు పోస్ట్ ద్వారా తెలిపిన నటుడు

తెలుగు బిగ్బాస్ సీజన్-4లో పాల్గొంటున్నట్లు పోస్ట్ ద్వారా తెలిపిన నటుడు

By: chandrasekar Wed, 26 Aug 2020 12:02 PM

తెలుగు బిగ్బాస్ సీజన్-4లో పాల్గొంటున్నట్లు పోస్ట్ ద్వారా తెలిపిన నటుడు


నటుడు నందు.. టాలీవుడ్ హీరోగా, ప‌లు షోలకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని ద‌క్కించుకున్నాడు. అయితే ఆయన బిగ్‌బాస్ సీజన్-4 లో పాల్గొంటున్నట్లు కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై హీరో నందు ముందే క్లారిటీ ఇచ్చాడు.

తాను తెలుగు బిగ్‌బాస్ సీజన్-4లో పాల్గొంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. బిగ్‌బాస్ షోలో తన ప్రయాణాన్ని కొనసాగించడానికి తనకు మద్దతు ఇవ్వాలంటూ నందు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులను కోరాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో మొదట BIGG అనౌన్స్‌మెంట్ చేయబోతున్నా అని పోస్ట్ పెట్టిన నందు, ఆ త‌ర్వాత డార్లింగ్స్ నేను బిగ్ బాస్ షోకి వస్తున్నా.. బీబీలో మన రచ్చ మామూలుగా ఉండదు. అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. నాకు మీ సపోర్ట్ కావాలి.. రేపు సాయంత్రం ఆరు గంటలకు ఇంకో అప్డేట్ ఇస్తున్నా రెడీగా ఉండండి అంటూ మ‌రో పోస్ట్ చేశాడు. ఇదిలాఉంటే నందు భార్య గీతా మాధురి కూడా బిగ్‌బాస్ సీజన్-2 షోలో కంటెస్టెంట్‌గా పాల్గొని కౌశల్‌కి గట్టి పోటీని ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే బిగ్ బాస్ షోలో పాల్గొనే వారు ఎవ‌రు ముందుగా అనౌన్స్ చేయకూడ‌దు. కాని నందు ముందే ఎంట్రీపై క్లారిటీ ఇవ్వడంతో ప్రస్తుతం నందు చర్చల్లో నిలిచాడు. బిగ్‌బాస్ షో పోటీదారుల జాబితా గురించి చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు చాలా మంది సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Tags :
|
|
|

Advertisement