Advertisement

  • సింగిల్‌గా ఉండటం వెనుక కారణాన్ని బయట పెట్టిన 47ఏళ్ల హీరోయిన్...

సింగిల్‌గా ఉండటం వెనుక కారణాన్ని బయట పెట్టిన 47ఏళ్ల హీరోయిన్...

By: chandrasekar Tue, 17 Nov 2020 4:15 PM

సింగిల్‌గా ఉండటం వెనుక కారణాన్ని బయట పెట్టిన 47ఏళ్ల హీరోయిన్...


నటి సితార తొలినాళ్లలో హీరోయిన్‌గా గుర్తింపు సాధించుకుని కాస్త బ్రేక్ తీసుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. ఆమెను తెరపై చూడగానే మన ఇంట్లో సభ్యురాలన్న భావన కలుగుతుంది. అందుకే కీలక పాత్రల కోసం దర్శక నిర్మాతలకు ఆమే మొదటగా సెలెక్ట్ చేస్తారు. అయితే తన సహనటీమణుల్లా పెళ్లి చేసుకుని హాయిగా పెళ్లి చేసుకుని జీవితాన్ని అనుభవించకుండా ఆమె ఒంటరిగా మిగిలిపోయారు. 47ఏళ్లు వచ్చినా ఆమె ఇంకా సింగిల్‌గా ఉండటం వెనుక కారణాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

కేరళలోని కిలిమానూర్ ప్రాంతంలో 1973, జూన్ 30న జన్మించారు సితార. ఆమె పూర్తిపేరు సితార నాయర్. కాలేజీ చదువుతున్న రోజుల్లోనే ఆమె సినిమా రంగంలోకి ప్రవేశించారు. తాను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోవడానికి తన తండ్రే కారణమని సితార ఓ చేదు నిజాన్ని బయటపెట్టారు. ‘నా తండ్రి అన్ని విషయాల్లోనే నాకు మద్దతుగా నిలిచేవారు. ప్రతి పనిలోనూ ఆయన సలహాలు తీసుకునేదాన్ని. అలాంటి నాన్న హఠాత్తుగా చనిపోవడంతో నేను షాక్‌లోకి వెళ్లిపోయాను. దీంతో కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరమయ్యాను. అలా చూస్తుండగానే ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. దీంతో పెళ్లి గురించి పెద్దగా ఆలోచించలేకపోయాను. భవిష్యత్తులో అలాంటి ఆలోచన గనుక వస్తే తప్పకుండా చేసుకుంటా’ అని చెప్పుకొచ్చారు సితార.

Tags :

Advertisement