Advertisement

‘నా కొత్త చిత్రంలో ‘పవర్‌స్టార్‌' ఇతనే

By: chandrasekar Thu, 09 July 2020 6:41 PM

‘నా కొత్త చిత్రంలో ‘పవర్‌స్టార్‌' ఇతనే


క‌రోనా స‌మ‌యంలోను కాంట్ర‌వ‌ర్సీ సినిమాలు చేస్తూ ‌సంచ‌ల‌నాల‌కి కేంద్ర‌బిందువుగా ఉండే రామ్ గోపాల్ వ‌ర్మ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు.

ఇటీవ‌వ‌ల త‌న ఆర్జీవి వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో క్లైమాక్స్, నేక్డ్ చిత్రాలు విడుద‌ల చేసిన వ‌ర్మ మర్డర్, వైరస్, 12 ఓ క్లాక్ మరియు థ్రిల్లర్ అనే సినిమాల‌ని త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌నున్నాడు. దీంతో ప‌వ‌ర్ స్టార్ అనే టైటిల్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

‘పవర్‌స్టార్‌' పేరుతో ఓ సినిమా తీయబోతున్నానని ట్విట్టర్‌ ద్వారా ప్రకటించిన వ‌ర్మ‌ అందుకు సంబంధించిన ఓ వీడియోను షేర్‌ చేస్తూ ‘నా కొత్త చిత్రంలో ‘పవర్‌స్టార్‌' ఇతనే. మా ఆఫీసుకు వచ్చినప్పుడు ఈ వీడియో తీశాం.

ఈ వ్యక్తిలో ఎవరి పోలికలైనా కనిపిస్తే అది అప్రయత్నంగా, యాదృచ్ఛికంగా జరిగినట్లుగా భావించాలి’ అని గ‌తంలో పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో ఆలోచిస్తూ కూర్చొని ఉన్నారు. పోస్టర్ పై ఎన్నికల తరువాత కథ అని, సినిమా దేని గురించి ఉంటుందో ఓ హింట్ ఇచ్చారు.

Tags :
|
|

Advertisement