Advertisement

  • కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న తెలుగు స్టార్ యాంకర్

కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న తెలుగు స్టార్ యాంకర్

By: Sankar Fri, 04 Dec 2020 10:10 PM

కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న తెలుగు స్టార్ యాంకర్


ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న అనసూయ ఇప్పుడు తమిళ ఆడియన్స్‌ను పలకరించడానికి వెళ్తున్నారు. కోలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఆమె తొలి తమిళ సినిమాను తాజాగా అంగీకరించారు.

అది కూడా తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి సినిమాలో కావడం విశేషం. తాను తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న విషయాన్ని అనసూయ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

మరో మంచి కథలో జీవిస్తున్నాను. కొత్త ప్రయాణం’’ అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అనసూయ పేర్కొన్నారు. అంతేకాదు, తన లుక్‌ను కూడా పోస్ట్ చేశారు. అద్దంలో తన అందాన్ని చూసుకుంటూ అనసూయ ఈ ఫొటోలో కనిపించారు. అచ్చతెలుగు అమ్మాయిలా చీరలో అందంగా సింగారించుకుని ఉన్నారు అనసూయ. ఈ లుక్‌కు ప్రముఖ నటి సిల్క్ స్మిత రిఫరెన్స్ అని అనసూయ పేర్కొన్నారు.

Tags :
|

Advertisement