Advertisement

  • తెలుగు సినీ పరిశ్రమ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి అన్న‌పూర్ణ‌...!

తెలుగు సినీ పరిశ్రమ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి అన్న‌పూర్ణ‌...!

By: Anji Wed, 23 Dec 2020 1:11 PM

తెలుగు సినీ పరిశ్రమ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి అన్న‌పూర్ణ‌...!

భార‌త్‌లోనూ క్యాస్టింగ్ కౌచ్ న‌డుస్తోందంటూ కొంత‌మంది తార‌లు ఆరోప‌ణ‌లు చేశారు కూడా. ఆ త‌ర‌హా ఘ‌ట‌న‌ల‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లువురు గ‌ళ‌మెత్తారు.టాలీవుడ్‌లో లైంగిక వేధింపులు సాధార‌ణ‌మంటూ శ్రీ‌రెడ్డి సృష్టించిన సంచ‌ల‌నం సంగ‌తి తెలిసిందే.

అయితే అలాంటివి ఇప్పుడే కాదు, అల‌నాటి నుంచే ఉన్నాయ‌ని సీనియ‌ర్ న‌టీమ‌ణులు అన్న‌పూర్ణ‌, వై. విజ‌య లాంటి వాళ్లు ఓపెన్‌గా చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 'ఎఫ్ 2' మూవీలో వెంక‌టేశ్‌తో అన్న‌పూర్ణ‌, వై. విజ‌య మ‌ధ్య స‌న్నివేశాలు ఎంత హాస్యాన్ని పండించాయో చూశాం.

ఆ ఇద్ద‌రూ ఇటీవ‌ల‌ 'ఆలీతో స‌ర‌దాగా' షోకు జంట అతిథులుగా వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా తాము చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన‌ప్ప‌టి ప‌రిస్థితులపై వారు మాట్లాడారు. ఇప్ప‌టి మాదిరిగానే అప్ప‌ట్లోనూ చాన్సుల పేరుతో వేధించేవాళ్లు ఉండేవాళ్ల‌ని అన్న‌పూర్ణ అన్నారు.

త‌న‌కు సైతం అలాంటివి ఎదుర‌య్యాయ‌ని ఆమె చెప్పారు. అవ‌కాశాల పేరుతో వారు కొత్త‌గా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన తార‌ల వెంట‌ప‌డేవాళ్ల‌ను ఆమె తెలిపారు.

ఇక అలాంటి పోకిరీలు ఎప్పుడూ ఇండ‌స్ట్రీలో ఉంటార‌నీ, వాళ్లకు దూరంగా ఉంటూ, మ‌న‌ల్ని మ‌నమే కాపాడుకోవాల‌నీ వై. విజ‌య సూచించారు. క్యాస్టింగ్ కౌచ్ అనే పేరు పెట్ట‌క‌పోయినా లైంగిక వేధింపులు అనేవి ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మొద‌ట్నించీ ఉండేవ‌ని ఆ సీనియ‌ర్ తారలు తేల్చేశారు.

Tags :

Advertisement