Advertisement

  • తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం...!

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం...!

By: Anji Sun, 04 Oct 2020 06:30 AM

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం...!

కరోనా మహమ్మారి కారణంగా షూటింగులు నిలిచిపోవడం, థియేటర్ల మూత వల్ల సినిమా పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఫిల్మ్ ఇండస్ట్రీ సమాలోచనలు చేస్తోంది.

ఇందులో భాగంగా.. తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరూ కలిసి ఈ కరోన సమయంలో ఇండస్ట్రీలో జరిగిన నష్టాన్ని గురించి చర్చించడం జరిగింది.

ఈ నష్టాన్ని ఎలా అధిగమించాలనే అంశంపై సమావేశాలు చర్చించామని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి.కళ్యాణ్ తెలిపారు. ఈ సమావేశాల సారాంశంను త్వరలో వెల్లడిస్తామని అన్నారు. ఒక సానుకూల వాతావరణంలో జరిగే ఈ చర్చలకు అందరూ పాజిటీవ్ గా స్పందిస్తున్నారని తెలిపారు.

కరోన కారణంగా షూటింగ్స్ ఆగిపోవడం, థియేటర్స్ మూతపడిన సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదివరకు జరిగిన నష్టానికి ఎలా అధిగమించాలి, ఎవరెవరు ఏ త్యాగాలు చెయ్యాలి అనే అంశంపై అన్ని శాఖల వారు చర్చిస్తున్నారని కార్యదర్శులు టి.ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల తెలిపారు.

Tags :
|
|

Advertisement