Advertisement

  • మతి పోగొడుతుంది బిగ్ బాస్ 4 టిఆర్పి రేటింగ్

మతి పోగొడుతుంది బిగ్ బాస్ 4 టిఆర్పి రేటింగ్

By: Anji Fri, 18 Sept 2020 10:13 AM

మతి పోగొడుతుంది బిగ్ బాస్ 4 టిఆర్పి రేటింగ్

తెలుగు బిగ్ బాస్ 4 సీజన్ గత వారం మొదలైన సంగతి తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ షో ఫై రోజు రోజుకు ఇంట్రస్ట్ పెరుగుతుంది. ఈ సీజన్ మొట్టమొదటి ఎపిసోడ్ కు ఏకంగా 18.5 టీఆర్పీ రేటింగ్ వచ్చిందట. అది కూడా ఇప్పటి వరకు వచ్చిన మూడు సీజన్ల కంటే మించి ఆల్ టైం రికార్డు టీఆర్పీను నెలకొల్పిందట.

ఇదే కింగ్ నాగ్ హోస్ట్ గా చేసిన లాస్ట్ సీజన్ కు 17.9 టీఆర్పీ రేటింగ్ రాగా దానిని బద్దలు కొట్టి మళ్ళీ కింగ్ నాగ్ స్మాల్ స్క్రీన్ కింగ్ అనిపించుకున్నారు. ఇక షో విషయానికి వస్తే..మొదటి మూడు రోజులు ఏడుపులతో కాస్త చిరాకు పెట్టించినప్పటికీ..ఆ తర్వాత బిగ్ బాస్ టాస్క్ లు మొదలుపెట్టే సరికి కాస్త ఊరట కలిగించింది.

ఇక శని, ఆదివారాలు ఎప్పటిలాగానే సందడిగా మారాయి. అట , పాటలతో సాగింది. ఇక మొదటివారానికి గాను డైరెక్టర్ సూర్య కిరణ్ హౌస్ నుండి ఎలిమినేషన్ అయ్యారు.

Tags :

Advertisement