Advertisement

  • Crazy Update: బిగ్ బాస్ 4 ఫినాలే... అరియానా గ్లోరికి చుక్కెదురైంది...!

Crazy Update: బిగ్ బాస్ 4 ఫినాలే... అరియానా గ్లోరికి చుక్కెదురైంది...!

By: Anji Sun, 20 Dec 2020 9:08 PM

Crazy Update: బిగ్ బాస్ 4 ఫినాలే... అరియానా గ్లోరికి చుక్కెదురైంది...!

బోల్డ్ యాంకర్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన అరియానా గ్లోరికి ఫైనల్‌లో చుక్కెదురైంది. టాప్ 5లోకి వచ్చి అనేక సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అరియానా బిగ్ బాస్ కల తీరకుండానే వెనుతిరిగింది.

15 వారాల జర్నీలో అరియానా గ్లోరి ముక్కుసూటిగా వ్యవహరిస్తూ.. షైనింగ్ స్టార్‌గా సత్తా చాటింది. ఆట తప్ప వేరే ధ్యాస లేకుండా కేవలం టైటిల్ గెలవడమే ధ్యేయంగా ఆట ఆడిందనే పేరు సంపాదించుకుంది.

అయితే అన్ని సీజన్‌లలో మేల్ కంటెస్టెంట్స్ విన్నర్ అవుతుండటంతో.. ఈసారి ఫిమేల్ కంటెస్టెంట్‌ని విన్నర్ చేయబోతున్నారనే ప్రచారం నడిచింది.

ఈ కోటాలో అరియానా గ్లోరి టైటిల్ విజేతగా అవతరించబోతుందంటూ ప్రచారం నడిచింది. అయితే టాప్ 5కి చేరిన అఖిల్, అభిజిత్, సొహైల్, హారికల నుంచి గట్టి పోటీ ఉండటంతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది అరియానా.

Tags :

Advertisement