Advertisement

రేపే బిగ్ బాస్ 4 ఫైనల్...!

By: Anji Sat, 19 Dec 2020 8:46 PM

రేపే బిగ్ బాస్ 4 ఫైనల్...!

రేపటితో బిగ్ బాస్ నాల్గో సీజన్‌ ముగిసిపోతుంది. అందుకే ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఇది గుర్తుండి పోయేలా ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్.

గత రెండు ఎపిసోడ్లలో కంటెస్టెంట్ల ప్ర‌యాణాన్ని వారి క‌ళ్ల‌ముందుంచిన బిగ్‌బాస్‌..తాజాగా ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి తీసుకొచ్చి పాత జ్ఞాపకాలను గుర్తుచేశాడు. అందరితోనూ సరదాగా డాన్సులు చేయించాడు.

చిలిపి ప్రశ్నలు అడిగించి ఇంటి కంటెస్టెంట్స్‌తో ఆడుకునేలా చేసాడు. మోనాల్‌, కరాటే కల్యాణి, లాస్య, కుమార్‌ సాయి, స్వాతి దీక్షిత్‌ ఇలా ఇలా చాలా మంది ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ మళ్లీ ఇంటికి వచ్చారు. వారు ఇంట్లో సందడి చేశారు.

Tags :

Advertisement