Advertisement

  • మొత్తానికి జరిగిపోయింది అంటున్న బిగ్ బాస్ బ్యూటీ... విషెస్ చెబుతున్న అభిమానులు

మొత్తానికి జరిగిపోయింది అంటున్న బిగ్ బాస్ బ్యూటీ... విషెస్ చెబుతున్న అభిమానులు

By: Sankar Thu, 29 Oct 2020 07:17 AM

మొత్తానికి జరిగిపోయింది అంటున్న బిగ్ బాస్ బ్యూటీ... విషెస్ చెబుతున్న అభిమానులు


బిగ్ బాస్ తో తెలుగు లో మంచి క్రేజ్ తెచ్చుకున్న వారిలో నటి పునర్నవి ఒకరు ..అప్పటిదాకా అడపదడపా సినిమాలు చేసినప్పటికీ బిగ్ బాస్ తో ఒక్కసారి ఆమె లైఫ్ మారిపోయింది...సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో పునర్నవి రిలేషన్‌షిప్ అప్పట్లో హాట్ టాపిక్. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య ఏదో ఉందనే భావనను ప్రేక్షకులకు కలిగించారు.

బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చిన తరవాత కొంత కాలం ఖాళీగా ఉన్న పునర్నవి ఆ తరవాత బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఆమె చేతిలో కొన్ని సినిమాలు, వెబ్ షోలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, పునర్నవి ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక ఫొటో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తనకు పెళ్లి కుదిరినట్టు, నిశ్చితార్థం అయిపోయినట్టు తెలియజేస్తూ ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను ఈ ఫొటోలో చూపించారు పున్ను. ‘‘మొత్తానికి జరిగిపోయింది’’ అని క్యాప్షన్ పెట్టారు..

దీనితో ఆమె అభిమానులు అందరు ఆమెకు విషెస్ చెబుతున్నారు ..అయితే మరికొంతమంది మాత్రం ఇది ఆమె చేయబోయే వెబ్ సిరీస్ ప్రొమోషన్ భాగం మత్రమే అంటున్నారు..మరి చూడాలి ఇందులో ఏది నిజమో...

Tags :
|
|
|
|

Advertisement