Advertisement

  • విజయ్ దేవరకొండ సినిమాలో అవకాశం అంటూ మోసం..

విజయ్ దేవరకొండ సినిమాలో అవకాశం అంటూ మోసం..

By: Sankar Sun, 13 Sept 2020 4:39 PM

విజయ్ దేవరకొండ సినిమాలో అవకాశం అంటూ మోసం..


ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల పేర్లు వాడుకొని మోసాలకు పాల్పడటం చాల ఎక్కువగా జరుగుతుంది..సింగర్ సునీత , గీత ఆర్ట్స్ , అజయ్ భూపతి వంటి వారి పేర్లను వాడుకొని మోసగాళ్లు అమాయకులను మోసం చేసిన విషయం మరవకముందే తాజాగా రౌడీ హీరో విజయ దేవరకొండ పేరు ఉపయోగించుకుని తప్పుడు ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నారని విజయ్ దేవరకొండ టీమ్ వెల్లడించింది.

'విజయ్‌ దేవరకొండతో సినిమా తీయబోతున్నామంటూ కొన్ని నిర్మాణ సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఆయన సినిమాకు ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నామంటూ.. నటీనటులను సంప్రదిస్తున్నాయి.అలాంటివారిని నమ్మవద్దని విజయ్ టీమ్ కోరింది. విజయ్ సినిమాకు సంబందించిన అప్డేట్స్ ను విజయ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలుపుతాడని అదేవిధంగా విజయ్‌ నటించబోతున్న ఏ ప్రాజెక్టైనా సరే నిర్మాతలు అధికారికంగా నేరుగా ప్రకటిస్తారు.అని క్లారిటీ ఇచ్చింది విజయ్ టీమ్.

కాగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాద్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కు ఫైటర్ అనే వర్కింగ్ టైటిల్ ను పెట్టారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. కరోనా కారణం గా ఈ సినిమా షూటింగ్ వాయిదాపడింది. ఈ సినిమా పై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి

Tags :
|

Advertisement