Advertisement

కంగనా నాకు ఏరోజు సపోర్ట్ చేయలేదు ..తాప్సి

By: Sankar Sat, 25 July 2020 6:43 PM

కంగనా నాకు ఏరోజు సపోర్ట్ చేయలేదు ..తాప్సి



బాలీవుడ్ బ్యూటీ కంగ‌నా ర‌నౌత్ ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తాప్సీ, స్వ‌ర భాస్క‌ర్, అలియా భ‌ట్‌తో పాటు ప‌లువురు న‌టీమ‌ణుల‌పై నిప్పులు చెరిగిన సంగ‌తి తెలిసిందే. తాప్సీని బీ గ్రేడ్ అని కంగ‌నా కామెంట్ చేయ‌గా, అందుకు త‌గ్గ స‌మాధానం ఇచ్చింది. ఇక తాజాగా ఇండ‌స్ట్రీ స‌పోర్ట్ ఉన్న స్టార్స్- లేని స్టార్స్ డిబేట్‌లో పాల్గొంది. ఇందులో కంగ‌నా త‌న‌కెప్పుడు స‌పోర్ట్ చేయ‌లేద‌ని పేర్కొంది.

ఎలాంటి స‌పోర్ట్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు కొన్నిసార్లు నా స్థానాన్ని కొంద‌రు భ‌ర్తీ చేశారు. అలాంటి స‌మ‌యంలో నాకు కంగనా ఎలాంటి సాయం చేయ‌లేదు. సొంత టాలెంట్‌తో ఈ స్థితికి చేరాను. సుశాంత్ కూడా ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి చేరుకున్నాడు.

ఇక త‌న స్థానాన్ని వేరే వారు భ‌ర్తీ చేయ‌డంపై కూడా స్పందించిన తాప్సీ .. చాలా సినిమాల‌లో నా స్థానం స్టార్ కిడ్స్‌తో రీప్లేస్ చేయ‌బ‌డింది. కాక‌పోతే కంగనా ఆమె సోద‌రి న‌న్ను కించ‌ప‌ర‌చ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. నాపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తుంటారు. అందుకు కార‌ణం ఆమె వంత నేను పాడ‌క‌పోవ‌డ‌మే అని తాప్సీ కంగ‌నాకి ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చింది. దీనిపై కంగ‌నా టీం నుండి ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో చూడాలి.

Tags :

Advertisement