Advertisement

  • Breaking News: అస్వ‌స్థ‌త‌తో అపోలోలో అడ్మిట్ అయిన ర‌జ‌నీ...!

Breaking News: అస్వ‌స్థ‌త‌తో అపోలోలో అడ్మిట్ అయిన ర‌జ‌నీ...!

By: Anji Fri, 25 Dec 2020 5:23 PM

Breaking News: అస్వ‌స్థ‌త‌తో అపోలోలో అడ్మిట్ అయిన ర‌జ‌నీ...!

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హాస్పిట‌ల్‌లో అడ్మిట్ అయ్యారు. సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన వారిలో రజినీకాంత్ ఒకరు.

తమిళ అభిమానులకు ఆరాద్య దైవంగా ఉన్న రజినీ ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా నటిస్తున్నారు. లింగ చిత్రం భారీ ఫ్లాప్ అయినా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తర్వాత కబాలీ,2.0,కాలా,దర్భార్ చిత్రాలతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

వచ్చే ఎన్నికల్లో తన సొంత పార్టీ తరుపు నుంచి ఎన్నికల్లో నిలబడబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆయ‌న ప్రస్తుతం న‌టిస్తోన్న 'అణ్ణాత్తే' యూనిట్ మెంబ‌ర్స్‌లో న‌లుగురికి క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ కావ‌డంతో రామోజీ ఫిల్మ్‌సిటీలో జ‌రుగుతున్న షూటింగ్‌ను మూడు రోజుల క్రితం నిలిపివేశారు. అయితే ర‌జనీకి నెగ‌టివ్ అని తేలింది.

అయిన‌ప్ప‌టికీ బీపీలో తీవ్ర‌మైన ఆటుపోట్లు రావ‌డంతో శుక్ర‌వారం ఆయ‌న‌ హైద‌రాబాద్‌లోని అపోలో హాస్పిట‌ల్‌లో చికిత్స కోసం చేరారు. ఆయ‌న ఆరోగ్య స్థితిపై హాస్పిట‌ల్ వ‌ర్గాలు ఓ అధికారిక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశాయి.రజినీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి కోలుకోవాలని అభిమానులు భగవంతున్ని ప్రార్థిస్తున్నారు.

Tags :

Advertisement