Advertisement

  • రెండోసారి తండ్రి కాబోతున్న తమిళ స్టార్ నటుడు

రెండోసారి తండ్రి కాబోతున్న తమిళ స్టార్ నటుడు

By: Sankar Thu, 08 Oct 2020 4:35 PM

రెండోసారి తండ్రి కాబోతున్న తమిళ స్టార్ నటుడు


ప్రముఖ తమిళ నటుడు కార్తి, ఆయన భార్య రంజని రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. 2011లో కార్తి, రంజని వివాహబంధంతో ఒక్కటయ్యారు. 2013లో వీరికి పాప జన్మించింది. ఆమెకు ఉమయాళ్ అని నామకరణం చేశారు. అయితే, కార్తి మరోసారి తండ్రి కాబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం.

తమిళ స్టార్ హీరో సూర్య తమ్ముడే ఈ కార్తి అని అందరికీ తెలిసిందే. ప్రముఖ తమిళ నటుడు శివకుమార్ పిల్లలే సూర్య, కార్తి. వీరికి సోదరి బృంద శివకుమార్ కూడా ఉన్నారు.సూర్య హీరోయిన్ జ్యోతికను పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం 2006లో జరిగింది. సూర్య, జ్యోతిక దంపతులకు దియా, దేవ్ ఇద్దరు సంతానం. మరికొద్ది రోజుల్లో కార్తి కూడా ఇద్దరు పిల్లలకు తండ్రి కాబోతున్నారు.

ఇక కార్తి సినిమాల విషయానికి వస్తే.. ఆయన తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించారు. కిందటేడాది ‘ఖైదీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి కలెక్షన్లు రాబట్టింది.

Tags :
|
|

Advertisement