తమిళ సినీ ఇండస్ట్రీ లో కరోనా కలకలం ..హీరో విశాల్ కు కరోనా పాజిటివ్
By: Sankar Sun, 26 July 2020 10:48 AM
కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలేలా లేదు ..సినిమాస్టార్స్ , రాజకీయ నాయకులూ ఇలా అందరికి కరోనా వస్తుంది ..టాలీవుడ్‌లో ఇప్పటి వరకు టెలివిజన్ సెలబ్రిటీలను వణికిస్తుంటే.. కోలీవుడ్‌లో అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన కొందరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది తాజాగా తమిళ ఇండస్ట్రీ లో ప్రముఖ నటుడు అయిన విశాల్ కూడా కరోనా బారిన పడ్డట్లు తెలిపాడు ..
అవును! అది నిజం. కరోనా పరీక్షల్లో మా నాన్న (జీకే రెడ్డి)కు పాజిటివ్ అని తేలింది. ఆయనకు సహాయకుడిగా ఉన్నందుకు నాలోనూ కరోనా లక్షణాలు బయటపడ్డాయి. తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడ్డాను. నా మేనేజర్‌కు కూడా ఇవే లక్షణాలు ఉన్నాయి. మేమంతా ఆయుర్వేద ఔషధాలు వాడి కేవలం వారం రోజుల్లో ప్రమాదం నుంచి బయటపడ్డాం. ప్రస్తుతం మేమంతా ఆరోగ్యంగా ఉన్నామని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నా’’ అని విశాల్ ట్వీట్ చేశారు.
కాగా గత కొంతకాలంగా తన ఆఫీసులో జరుగుతున్న విషయాలతో వార్తల్లో నిలుస్తున్న విశాల్ , తాజాగా కరోనా కారణంగా మరొక సారి వార్తల్లోకి వచ్చాడు ..ప్రస్తుతం విశాల్ డిటెక్టివ్ 2 తో పాటు ‘చక్ర’ అనే సినిమాలోనూ కనిపించనున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఈ చిత్రాల షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది