Advertisement

  • బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలతో తమిళ హీరో ఎంగేజ్మెంట్

బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలతో తమిళ హీరో ఎంగేజ్మెంట్

By: chandrasekar Mon, 07 Sept 2020 6:14 PM

బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలతో తమిళ హీరో ఎంగేజ్మెంట్


తమిళ హీరో విష్ణు విశాల్ భారత బ్యాడ్మింటన్ సీనియర్ ప్లేయర్ గుత్తా జ్వాలాతో తనకి ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు సోమవారం ప్రకటించాడు. గత రెండేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట గుత్తా జ్వాల పుట్టిన రోజు సందర్భంగా ఒకటైంది.

ఈ మేరకు ఉంగరాలు మార్చుకున్న ఫొటోల్ని విష్ణు విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వాస్తవానికి విష్ణు విశాల్‌కి 2010లోనే రజిని నటరాజ్ అనే అమ్మాయితో వివాహమైంది. వారికి ఆర్యన్ అనే కొడుకు కూడా ఉన్నాడు. కానీ మనస్పర్థలు కారణంగా 2018లో విష్ణు- రజిని విడిపోయారు.

మరోవైపు గుత్తా జ్వాలాకి కూడా భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌తో 2005లో వివాహమైంది. కానీ.. ఈ ఇద్దరూ 2011లో విడిపోయారు. విష్ణు- జ్వాలా త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు సన్నిహితులు తెలియచేసారు.

Tags :
|

Advertisement