Advertisement

వకీల్ సాబ్ పక్కన తమన్నా ..?

By: Sankar Fri, 03 July 2020 11:57 AM

వకీల్ సాబ్ పక్కన తమన్నా ..?



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వచ్చి మూడేళ్లు కావొస్తుంది ..చివరిగా అజ్ఞాతవాసి సినిమాతో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ ఆ తర్వాత రాజకీయాలలో బిజీగా ఉండి సినిమాలకు దూరం అయ్యాడు ..దీనితో పవన్ కళ్యాణ్ అభిమానులు నిరాశ చెందారు ..టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ సినిమాలకు హిట్ ప్లాప్ తో సంబంధం ఉండదు ..ఇలాంటి క్రెజ్ కేవలం అతి కొద్దీమందికి మాత్రమే సాధ్యం అవుతుంది ..

అందుకే మూడేళ్లు తర్వాత సినిమా నటిస్తా అని చెప్పగానే అభిమానుల్లో ఎక్కడలేని ఆనందం వచ్చింది ..దీనితో దిల్ రాజు నిర్మాతగా , వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాను వకీల్సాబ్ పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు ..ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ , ఫస్ట్ సాంగ్ విపరీతంగా ఆకట్టుకున్నాయి ..

ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే పవన్‌తో రొమాన్స్ చేయబోయే హీరోయిన్ కోసం ఎప్పట్నుంచో అన్వేషణ జరుగుతోంది. ఇలియానా, శృతీ హాసన్ వంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. చివరికి తమన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇప్పటికే తమన్నాతో సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. భారీ పారితోషికం, పైగా పవన్ సినిమా కావడంతో తమన్నా వెంటనే ఓకే చెప్పేసిందని సమాచారం. పవన్, తమన్నా గతంలో `కెమేరామెన్ గంగతో రాంబాబు సినిమాలో నటించారు ..ఆ సినిమాలో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది .అందుకే తమన్నా వైపే నిర్మాతలు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది ..

Tags :

Advertisement