Advertisement

  • మెగాస్టార్ తో ఆడిపాడనున్న మిల్క్ బ్యూటీ ..?

మెగాస్టార్ తో ఆడిపాడనున్న మిల్క్ బ్యూటీ ..?

By: Sankar Wed, 15 July 2020 11:13 AM

మెగాస్టార్ తో ఆడిపాడనున్న మిల్క్ బ్యూటీ ..?



టాలీవుడ్ లో డాన్సులతో అదరగొట్టే హీరోయిన్ అంటే అందరికి ముందుగా గుర్తుకొచ్చే పేరు తమన్నా ..హీరోలతో పోటీ పది మరి తమన్నా స్టెప్పులు వేస్తుంది ..అయితే ఇటీవల కాలంలో స్పెషల్ పాటలతో అభిమానులను అలరిస్తున్న తమన్నా మరొక స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది ..మెగాస్టార్ చిరంజీవి , కొరటాల శివ కలయికలో ఆచార్య సినిమా వస్తున్న విషయం తెలిసిందే ..అయితే ఈ దాదాపు పన్నెండు ఏళ్ళ తర్వాత మణిశర్మ చిరంజీవి సినిమాకి సంగీతం అందిస్తున్నారు ..దీనితో ఈ సినిమాలోని పాటల మీద బారి అంచనాలు ఉన్నాయి ..చిరంజీవి , మణిశర్మ కంబినేషన్ గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ..

అయితే ఈ ఆచార్య సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ లో చిరంజీవితో పాటు ఆడిపాడనుంది అని తెలుస్తుంది..ఇప్పటికే సైరా చిత్రంలో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న తమన్నా.. మరోసారి ఆయనతో కలిసి ఆడిపాడనుందట. ఇక రెజీనా సైతం ఒక ప్రత్యేక పాటలో కనిపించనుందని వార్తలు వచ్చాయి. అయితే రెజీనా ప్లేస్‌లో తమన్నాను తీసుకున్నారా?? లేక ఇద్దరు బ్యూటీలకు రెండు స్పెషల్ సాంగ్స్ ఇచ్చారా? అన్నదానిపై క్లారిటీ రావాల్సిఉంది..

ఇక చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్ నటిస్తోంది. మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెం.150’లో ఆడిపాడిన కాజల్.. మరోసారి మెగాస్టార్‌తో జోడీ కట్టే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. మొదటిగా ఈ సినిమాకి త్రిషను హీరోయిన్‌గా ఎంపిక చేయగా.. ఆమె డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ‘ఆచార్య’ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

Tags :
|

Advertisement