Advertisement

  • ఓకే సంవత్సరం లో వందల కోట్లు సంపాదించిన తాప్సీ

ఓకే సంవత్సరం లో వందల కోట్లు సంపాదించిన తాప్సీ

By: chandrasekar Mon, 08 June 2020 3:38 PM

ఓకే సంవత్సరం లో వందల కోట్లు సంపాదించిన తాప్సీ


బాలీవుడ్ నటి తాప్సీకి తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే మూలాలు ఇక్కడే ఉన్నాయి కదా. అయితే సౌత్‌లో ఈమెను కేవలం గ్లామర్ డాల్‌గా మాత్రమే చూసారు. అందుకే ఇక్కడ పెద్దగా సక్సెస్ కాలేదు తాప్సీ. కానీ బాలీవుడ్ మాత్రం ఈమెలో ఉన్న నటిని గుర్తించింది. అందుకే వరసగా అక్కడ విజయాలు వస్తున్నాయి. దాంతో పాటు ప్రశంసలు కూడా దక్కుతున్నాయి.

గత 12 నెలల కాలంలో తాప్సీ ఏ బాలీవుడ్ హీరోయిన్ సాధించలేని విజయాలతో పాటు కోట్లు కూడా సంపాదించింది. ఓ లెక్క ప్రకారం ఏడాదిలో ఈమె నటించిన 5 సినిమాలు కలిపి దాదాపు 360 కోట్లు వసూలు చేసాయి. 1. బద్లా: అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు విజయం కూడా అందుకుంది. దాదాపు 130 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. తెలుగులో ఇదే సినిమాను అడాప్ట్ చేసుకుని ఎవరు సినిమా చేసాడు అడవి శేష్. అది కూడా విజయం సాధించింది.

కుర్ర దర్శకుడు అశ్విన్ శరవణన్ తెరకెక్కించిన గేమ్ ఓవర్ సినిమా తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ విడుదలైంది. విభిన్నమైన కథతో వచ్చిన ఈ చిత్రం పర్లేదనిపించింది. దాదాపు 16 కోట్ల వరకు వసూలు చేసింది ఈ చిత్రం. అక్షయ్ కుమార్ హీరోగా జగన్ శక్తి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ మిషన్ మంగళ్. ఈ చిత్రంలో విద్యా బాలన్, నిత్య మీనన్ లాంటి వాళ్లతో పాటు తాప్సీ కూడా నటించింది. ఈ చిత్రం దాదాపు 280 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

taapsee,has earned,hundreds,of crores,in the year ,ఓకే సంవత్సరం లో, వందల, కోట్లు, సంపాదించిన, తాప్సీ


2019లో తాప్సీ నటించిన మరో భిన్నమైన సినిమా సాండ్ కీ ఆంఖ్. షార్ప్ షూటర్స్ చంద్రో, ప్రకాశీ తోమర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సీతో పాటు భూమి ఫడ్నేకర్ కూడా నటించింది. ఈ సినిమా కూడా 30 కోట్ల వరకు వసూలు చేసింది.

ఇక 2020 మార్చ్‌లో విడుదలైన సినిమా తప్పడ్. చెంపదెబ్బపై వచ్చింది ఈ చిత్రం. భార్యాభర్తల బంధాన్ని బేస్ చేసుకుని వచ్చిన ఈ సినిమా కూడా దాదాపు 40 కోట్లకు పైగానే వసూలు చేసింది. విమర్శలతో పాటు విజయం కూడా అందుకుంది తప్పడ్. తాప్సీ మొత్తానికి గత ఏడాది కాలంలో ఐదు సినిమాలతో పాటు 350 కోట్లకు పైగా వసూలు చేసి సత్తాచాటింది.


Tags :

Advertisement