Advertisement

  • 15 ఏళ్ళు వ్యత్యాసం ఉన్న వ్యక్తితో ప్రేమలో పడతానని అనుకోలేదు ...మాజీ విశ్వ సుందరి

15 ఏళ్ళు వ్యత్యాసం ఉన్న వ్యక్తితో ప్రేమలో పడతానని అనుకోలేదు ...మాజీ విశ్వ సుందరి

By: Sankar Thu, 19 Nov 2020 6:42 PM

15 ఏళ్ళు వ్యత్యాసం ఉన్న వ్యక్తితో ప్రేమలో పడతానని అనుకోలేదు ...మాజీ విశ్వ సుందరి


మాజీ విశ్వసుందరి‌ సుష్మితా సేన్‌ పెళ్లి కాకుండానే ఇద్దరూ ఆడ పిల్లలను దత్తత తీసుకుని తల్లయ్యారు. ఈ మాజీ బ్యూటీ క్వీన్‌ మోడల్‌ రోహమన్‌ షాల్‌తో కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

అయితే రోహమన్‌, సుష్మితాకు మధ్య 15 సంవత్సరాలు వ్యత్యాసం ఉంది. అంటే సుష్మితా కంటే రోహమన్ 15 ఏళ్ల చిన్నవాడు. ఈ నేపథ్యంలో సుష్మితా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ రోహ్మాన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో కలిసినట్లు వెల్లడించారు.

‘కొన్నెళ్ల క్రితం సోషల్‌ మీడియాలో రోహమన్ నేరుగా ఓ మెసేజ్‌ పెట్టాడు. అది చూసి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో‌ రోహమన్‌ను కనెక్ట్‌ అయ్యాను. ఆ తర్వాత రోజు మేము సందేశాలు పంపుకోవడం చేశాం. కానీ 15 సంవత్సరాల వ్యత్యాసం ఉన్న వ్యక్తితో ప్రేమలో పడతానని ఆ సమయంలో నేను ఊహించలేదు’ అని చెప్పుకొచ్చారు

Tags :
|

Advertisement