Advertisement

  • సుశాంత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా విడుదల నేడే ..

సుశాంత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా విడుదల నేడే ..

By: Sankar Fri, 24 July 2020 1:24 PM

సుశాంత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా విడుదల నేడే ..



ఇటీవల మరణించిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా ...బాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో ఒకడైన సుశాంత్ ఇలా అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడంతో సెలెబ్రిటీలు , అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు ..దీనితో చనిపోయేనాటికి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న దిల్ బేచారా సినిమాను కరోనా పరిస్థితుల వలన ఓటిటి లో విడుదల చేయాలనీ నిర్మాతలు నిర్ణయించారు ..ఎలాగ అయినా తమ అభిమాన నటుడు చివరి చిత్రాన్ని థియేటర్లో చూడాలన్న కోరిక నెరవేరకపోవడంతో ఓటిటి లో అయినా చూడాలని సుశాంత్ అభిమానులు ఎదురు చూస్తున్నారు ..

అయితే ఈ చిత్రం దిల్ బేచారా ఇవాళ రాత్రి 7.30 నిమిషాల‌కు డిస్నీ హాట్‌స్టార్‌లో రిలీజ్‌కానున్న‌ది. 2014లో రిలీజైన హాలీవుడ్ రొమాంటిక్ డ్రామా ద ఫాల్ట్ ఇన్ అవ‌ర్ స్టార్స్‌కు రీమేక్‌గా తీశారు. ముఖేశ్ చ‌బ్రా డైర‌క్ట‌ర్‌గా చేశాడు. జూన్ 14వ తేదీన ముంబైలోని బాంద్రాలో సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. ఫిల్మ్ రిలీజ్ సంద‌ర్భంగా బాలీవుడ్ సెల‌బ్ర‌టీలు ట్వీట్ల‌తో హోరెత్తించారు.

సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ అంఖిత లోఖండే కూడా ఇన్‌స్టాలో కామెంట్‌ చేసింది. నువ్వెక్క‌డ ఉన్నా.. న‌వ్వుతూనే ఉండాలంటూ ఆమె త‌న ఇన్‌స్టాలో పెట్టింది. దిల్ బేచారా పోస్టర్ చూస్తుంటేనే తెగ టెన్ష‌న్ పుడుతోంద‌ని హీరోయిన్ శిల్పా శెట్టి ఇన్‌స్టాలో పోస్టు పెట్టింది. మ‌రోవైపు సుశాంత్ డెత్ కేసులో సీబీఐ ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌న్న డిమాండ్ పెరుగుతూనే ఉన్న‌ది.

Tags :

Advertisement