Advertisement

  • కన్నీళ్లు తెప్పిస్తున్న సుశాంత్ సింగ్ చివరి సినిమా ట్రైలర్..

కన్నీళ్లు తెప్పిస్తున్న సుశాంత్ సింగ్ చివరి సినిమా ట్రైలర్..

By: Sankar Mon, 06 July 2020 9:31 PM

కన్నీళ్లు తెప్పిస్తున్న సుశాంత్ సింగ్ చివరి సినిమా ట్రైలర్..

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చివరిగా నటించిన ‘దిల్‌ బేచారా’ ట్రైలర్‌ విడుదల అయ్యింది. కాసేపటి క్రితమే ఈ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఇందకు సంబంధించి ఆ చిత్ర బృందం సోషల్‌ మీడియాలో ముందుగానే అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమాలో సుశాంత్‌కు జోడిగా సంజనా సంఘి నటించారు. సంజనా కూడా ట్రైలర్‌ విడుదలకు సంబంధించిన పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. తనకు ఎంతో ఇష్టమైన సీన్లలో ఇది ఒకటి అని పేర్కొన్నారు.

ఇక ట్రైలర్‌ చూసిన వారందరికీ సుశాంత్ జీవితమే ఆ సినిమా అన్నట్లుగా అనిపించింది. ఇందులో సుశాంత్ నోటి నుంచి వచ్చే ప్రతీ డైలాగ్ కూడా ఆయన అభిమానుల్ని కట్టి పడేసింది.ఎలా పుట్టాలి ఎప్పుడు చావాలి అన్నది మనం డిసైడ్ చేయలేము ..కేవలం ఎలా బతకాలి అన్నది మాత్రమే మన చేతుల్లో ఉంది అని సుశాంత్ చెప్పే డైలాగు అభిమానుల చేత కన్నీళ్లు తెప్పించాయి .ఇందులో హీరోయిన్‌కు క్యాన్సర్ ఉంటుంది.

కానీ ఆమెను కలిసిన హీరో ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆమె కోరికలన్నీ తీరుస్తుంటాడు. ఇక ఈ చిత్రం జూలై 24న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. అయతే ఎలాంటి సబ్‌స్క్రిప్షన్‌ చార్జీలు లేకుండా ఉచితంగా అందరికి అందుబాటులో ఉండనుంది

Tags :

Advertisement