Advertisement

  • రియా చక్రవర్తిపై సుశాంత్ ఫిట్నెస్ ట్రైనర్ సంచలన ఆరోపణలు

రియా చక్రవర్తిపై సుశాంత్ ఫిట్నెస్ ట్రైనర్ సంచలన ఆరోపణలు

By: Sankar Thu, 30 July 2020 9:00 PM

రియా చక్రవర్తిపై సుశాంత్ ఫిట్నెస్ ట్రైనర్ సంచలన ఆరోపణలు



సుశాంత్ సింగ్ మరణం అతడి ప్రియురాలిగా భావిస్తున్న రియా మెడకు చుట్టుకుంటుంది ..ఇప్పటికే రియా మీద అనేక మంది ఆరోపణలు చేస్తుండగా తాజాగా సుశాంత్ ఫిట్నెస్ ట్రైనర్ కూడా సంచలన ఆరోపణలు చేసాడు ..రియా చ‌క‌వ్ర‌ర్తితో ఫ్రెండ్ షిప్ మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి సుశాంత్ సింగ్ డిఫ‌రెంట్ క‌నిపించాడ‌ని స‌మీ అహ్మ‌ద్ రిప‌బ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు.

నేను జూన్ 1న సుశాంత్ తో మాట్లాడాను. మా అమ్మ చ‌నిపోయింద‌ని తెలుసుకుని సుశాంత్ నాకు ఫోన్ చేశాడు. అమ్మ గురించి అడిగి తెలుసుకున్నాడు. మా నాన్న‌ను మంచిగా చూసుకోవాలని సుశాంత్ నాతో చెప్పేవాడు. ఏమైనా అవ‌స‌ర‌మైతే త‌న‌కు చెప్పాల‌ని, ఇంటికి ర‌మ్మ‌ని చెప్పేవాడు.

నాకు, అమ్మ‌కు సుశాంత్ చాలా క్లోజ్ గా ఉండేవాడు. ఒక‌వేళ సుశాంత్ డిప్రెష‌న్ లో ఉంటే రియా సూచించిన డాక్ట‌ర్ సుశాంత్ కు మెడికేష‌న్ (మందులివ్వ‌డం)ముందు కౌన్సెలింగ్ సెష‌న్ ఇప్పించాల్సింది. కౌన్సెలింగ్ థెర‌పీ కూడా ఇవ్వాలి. ఒక‌వేళ డాక్టర్ కు ఆ విష‌యం తెలియ‌క‌పోతే..డిప్రెష‌న్ ను ఎలా దూరం చేయాలో కూడా తెలియ‌దు. అప్పుడు ఆ డాక్టర్ సుశాంత్ కు ఎలా మందుల రాస్తాడ‌ని స‌మీ అహ్మ‌ద్ చెప్పాడు. డాక్ట‌ర్ రియా ద్వారా సుశాంత్ కు మందులు ఇచ్చాడ‌ని స‌మీ అహ్మాద్ ఆరోపించారు. స‌మీ అహ్మ‌ద్ చెప్పిన విష‌యాలు మ‌రిన్ని అనుమానాల‌కు తావిస్తోంది.

Tags :
|

Advertisement