Advertisement

  • సూర్య ఆకాశమే నీ హద్దురా రీమేక్ లో బాలీవుడ్ స్టార్ హీరో !

సూర్య ఆకాశమే నీ హద్దురా రీమేక్ లో బాలీవుడ్ స్టార్ హీరో !

By: Sankar Tue, 17 Nov 2020 06:17 AM

సూర్య ఆకాశమే నీ హద్దురా రీమేక్ లో బాలీవుడ్ స్టార్ హీరో !


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తమిళ సినిమా సూరారై పోట్రూ ఓటీటీ లో రిలీజైంది. ఇదే సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో రిలీజైంది. మంచు మోహన్ బాబు కీలక పాత్ర లో కనిపించారు. ప్రముఖ దర్శకురాలు సుధ కొంగర ఈ సినిమాని తెరకెక్కించారు. అంచనాలకి తగ్గట్టే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ సినిమా థియేటర్లలో విడుదల అయితే ఖచ్చితంగా వంద కోట్లను వసూళ్లు చేసిది అంటూ ప్రేక్షకులు మరియు విశ్లేషకులు నమ్మకంగా చెబుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో హిందీలో రీమేక్ విషయమై ఆలోచిస్తున్నట్లుగా సూర్య పేర్కొన్నాడు. ఈ సినిమాకు సూర్య నిర్మాత అవ్వడం వల్ల ఇప్పుడు ఆయన నిర్ణయం ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

షాహిద్ కపూర్ ముఖ్య పాత్రలో సూరారై పోట్రూ రీమేక్ తెరకెక్కే అవకాశం ఉంది అంటూ తమిళ సినీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. హిందీలో రీమేక్ చేస్తే అక్కడ కూడా సుధ కొంగర దర్శకత్వం వహించే అవకాశం ఎక్కువగా ఉందంటూ ఇండస్ట్రీవర్గాల వారు అంటున్నారు.

Tags :
|
|

Advertisement