Advertisement

ప్రభాస్ అభిమానులకు సర్‌ప్రైజ్...

By: chandrasekar Thu, 19 Nov 2020 2:42 PM

ప్రభాస్ అభిమానులకు సర్‌ప్రైజ్...


బాహుబలి సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి ప్రంపంచస్థాయి నటుడిగా గుర్తింపు పొందాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ తరువాత ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం రాధే శ్యామ్, ఆదిపురుష్ వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ఆ సినిమాల వివరాల కోసం డార్లింగ్ అభిమానులు నిత్యం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మూవీమేకర్స్ గురువారం ఉదయం ప్రభాస్ 22వ సినిమా ‘ఆది పురుష్‌’ రిలీజ్ డేట్‌ ను ప్రకటిస్తూ.. అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

ఆగస్టు 11, 2022న ఆదిపురుష్‌ సినిమా విడుదలవుతుందని మూవీ మేకర్స్ చెప్పారు. 3డీ మూవీగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుందని పేర్కొంది. అయితే 2021 జనవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని మూవీ మేకర్స్ ట్విట్ చేసి ప్రకటించారు. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాకు తన్హాజీ సినిమా ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా.. టీ-సిరీస్ బ్యానర్‌లో భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్‌ ఫ్యాంటసీ చిత్రంలో ప్రభాస్‌ రాముడి పాత్రలో, బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ రావణాసురుడిగా నటించనున్నారు. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలను ఎవరుచేస్తున్నారన్న విషయంపై ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఆదిపురుష్ సినిమా రిలీజ్ డేట్‌ను మూవీ మేకర్స్ ప్రకటించడంతో యంగ్ రెబల్ స్టార్ అభిమానులు సంబరపడుతున్నారు.

Tags :
|

Advertisement