Advertisement

  • రెండుపాత్రల్లో నటించనున్న సూప‌ర్ స్టార్ మహేష్ బాబు

రెండుపాత్రల్లో నటించనున్న సూప‌ర్ స్టార్ మహేష్ బాబు

By: chandrasekar Sat, 03 Oct 2020 3:49 PM

రెండుపాత్రల్లో నటించనున్న సూప‌ర్ స్టార్ మహేష్ బాబు


రెండుపాత్రల్లో సూప‌ర్ స్టార్ మహేష్ బాబు నటించనున్నారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఈ ఏడాది స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హేష్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా క‌నిపించి అభిమానులని అల‌రించాడు. ఇక త‌న తాజా ప్రాజెక్టులో భాగంగా ప‌ర‌శురాంతో క‌లిసి స‌ర్కారు వారి పాట అనే చిత్రాన్ని చేస్తున్నాడు.

లాక్ డౌన్ వల్ల ఈ సినిమాలకు షూటింగ్‌కు క‌రోనా బ్రేక్ వేసింది. క‌రోనా ఉదృతి త‌గ్గాకే షూటింగ్ మొద‌లు పెడ‌దామని మ‌హేష్ చెప్పిన‌ట్టు తెలుస్తుంది. అయితే క‌రోనా మొద‌లైన‌ప్ప‌టి నుండి ఇంటికే ప‌రిమిత‌మైన మ‌హేష్ ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. 'ఫ్లిప్‌కార్ట్ ది బిగ్‌ బిల్లియన్‌ డేస్‌' షురూ అయినట్లుగా చెబుతూ మ‌హేష్ పై ఓ యాడ్‌ని చిత్రీక‌రించారు.

ఇందులో మ‌హేష్ రెండు పాత్ర‌ల‌లో క‌నిపించారు. అన్న‌య్యగా , త‌మ్ముడిగా క‌నిపించి సంద‌డి చేశాడు. రెండు పాత్ర‌ల‌లోను మ‌హేష్ హ్యాండ్స‌మ్ లుక్‌లో క‌నిపిస్తూ అమ్మాయిల మ‌న‌సుల‌ని దోచుకుంటున్నాడు. దీంతో అయన డ్యూయల్ రోల్లో నటించనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి వుంది.

Tags :
|

Advertisement