Advertisement

  • సూపర్ స్టార్ రజినీకాంత్ కు తీవ్ర అస్వ‌స్థ‌త‌

సూపర్ స్టార్ రజినీకాంత్ కు తీవ్ర అస్వ‌స్థ‌త‌

By: Sankar Fri, 25 Dec 2020 3:50 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ కు తీవ్ర అస్వ‌స్థ‌త‌


సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అనారోగ్యానికి గుర‌య్యారు. రక్త పోటులో హెచ్చు త‌గ్గుల‌ వ‌ల‌న జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుప‌త్రిలో ఆయ‌న చేరారు. అయితే ఆయ‌న‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా నెగిటివ్ రిపోర్టు వ‌చ్చిన‌ట్టు తెలిపారు.

ఈ నెల 22న నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల‌లోను ర‌జ‌నీకాంత్‌కు క‌రోనా నెగెటివ్ వ‌చ్చింద‌ని ఆపోలో ఆసుప‌త్రి వైద్యులు పేర్కొన్నారు. బీపీ అదుపులో లేక‌పోవ‌డంతో ఆసుప‌త్రిలో చేరిన ర‌జనీకాంత్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. బీపీ కంట్రోల్ కాగానే డిశ్చార్జ్ చేస్తాం అని వైద్యులు ప్రెస్ నోట్‌లో తెలిపారు..

కాగా గత పది రోజులుగా రజనీకాంత్‌ నగరంలోనే ఉంటున్నారు. అయితే చిత్ర యూనిట్‌లో 8 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో షూటింగ్‌ వాయిదా పడింది. దీంతో ముందు జాగ్రత‍్త చర్యగా రజనీకాంత్‌ కూడా మూడు రోజులపాటు క్వారంటైన్‌లో ఉన్నారు.

Tags :

Advertisement