Advertisement

  • సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా మెగా మేనల్లుడి సాంగ్ రిలీజ్...

సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా మెగా మేనల్లుడి సాంగ్ రిలీజ్...

By: Sankar Sun, 08 Nov 2020 8:19 PM

సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా మెగా మేనల్లుడి సాంగ్ రిలీజ్...


మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఉప్పెన. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

కాగా ఈ సినిమా విడుదల కు ముందే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. దీనికి కారణం దేవీ శ్రీ అందించిన అద్భుతమైన సంగీతం ఇప్పటికే ఈ సినిమానుంచి రెండు పాటలు విడుదల అయ్యాయి. ముఖ్యంగా నీ కన్ను నీలి సముద్రం అనే పాట ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమానుంచి మూడో సాంగ్ రాబోతుంది.

సినిమానుంచి రంగులద్దుకున్న అంటూ దేవీశ్రీ ఆలపించిన సాంగ్ ని నవంబర్ 11న చిత్రబృందం రిలీజ్ చేయనుంది. తాజాగా ఈ సాంగ్ కు సంబందించిన వర్చువల్ సాంగ్ సిట్టింగ్ ను విడుదల చేసారు. ఇక లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన ఉప్పెనను సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు

Tags :
|

Advertisement