Advertisement

  • 26 ఏళ్ళ వయస్సులో ఒక అమ్మాయిని ప్రేమించాను ..సూపర్ స్టార్ మహేష్ బాబు

26 ఏళ్ళ వయస్సులో ఒక అమ్మాయిని ప్రేమించాను ..సూపర్ స్టార్ మహేష్ బాబు

By: Sankar Mon, 01 June 2020 08:21 AM

26 ఏళ్ళ వయస్సులో ఒక అమ్మాయిని ప్రేమించాను ..సూపర్ స్టార్ మహేష్ బాబు

తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు అభిమానులతో ముచ్చటించారు..తన వ్యక్తిగత జీవితం మొదలు సినీ జీవితం గురించి అనేక విషయాలను పంచుకున్నాడు..

మీకు ఇష్టమైన రంగు , ఇష్టమైన ఫుడ్ ఏది అని ఓకే అభిమాని అడగగా , నచ్చిన రంగు బ్లూ , నచ్చిన ఆహారం హైదరాబాద్ బిర్యానీ అని సూపర్ స్టార్ సమాధానం ఇచ్చాడు ..రాజమౌళి తో సినిమా ఎప్పుడు అని అడగగా ఖచ్చితంగా ఉంటుంది అని బదులు ఇచ్చాడు..26 ఏళ్ళ వయసులో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను , ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను..తాను ఎవరో కాదు నా భార్య నమ్రత అని నవ్వుతూ చెప్పాడు .నమ్రతనే న బెస్ట్ ఫ్రెండ్ అని అన్నాడు ..తన ఇద్దరు పిల్లలు గౌతమ్ , సితార లలో ఎవరు తక్కువ కాదు అని , ఇద్దరం సమానమే అని అన్నాడు ..

super star,mahesh,namratha,gautham,sithara,krishna ,సూపర్ స్టార్ , మహేష్ బాబు, రాజమౌళి ,  నమ్రత , గౌతమ్ , సితార

నేను ఎప్పుడు పర్ఫెక్షన్ కోసం తపిస్తూ ఉంటాను , పనిలో పర్ఫెక్ట్ గా ఉంటేనే మనం అంత విజయవంతం అవుతాము ..ఇక తనకు బ్లాక్బస్టర్ హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ తో సినిమా ఎప్పుడు అని అంటే అయన కథ చెప్తే నేను ఎప్పుడైనా సిద్దమే అని అన్నాడు ..ఇక తన కొత్త సినిమా సర్కార్ వారి పాట లో హీరోయిన్ గా ఎవరిని తీసుకున్నారు అని అడగగా ,ఇంకా ఎవరిని తీసుకోలేదు నీకు ఎవరు కావాలో చెప్పు అని చమత్కరించాడు ..

రష్మిక , సమంత లలో ఎవరు ఇష్టం అంటే , ఇద్దరు నాతో కలిసి పని చేసారు ఇద్దరు నా బెస్ట్ కో స్టార్స్ అని అన్నాడు బాగా వర్షం పడుతోంది. ఏం స్నాక్స్‌ తింటే బావుంటుంది అనుకుంటున్నారు అని అడగగా, మిర్చి బజ్జీ, అల్లం టీ అని అన్నాడు ..తన కొడుకు కూడా హీరో అయ్యేలా ఉన్నాడు అని కాలమే సమాధానం చెప్పాలి అని అన్నాడు ..చివరగా తనకు ఇంత ప్రేమాభిమానాలు పంచిన అభిమానుల వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్న అని అన్నాడు ..మీకు మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాను. మీ అందర్నీ ప్రేమిస్తాను. అందరూ ఇంట్లోనే ఉండండి. క్షేమంగా ఉండండి

Tags :
|

Advertisement