Advertisement

  • మరో సారి మంచి మనస్సు చాటుకున్న సూపర్ స్టార్ మహేష్....!

మరో సారి మంచి మనస్సు చాటుకున్న సూపర్ స్టార్ మహేష్....!

By: Anji Sun, 01 Nov 2020 2:29 PM

మరో సారి మంచి మనస్సు చాటుకున్న సూపర్ స్టార్ మహేష్....!

వెండితెరపై సూపర్ స్టార్ అనిపించుకోవడమే కాదు తెరవెనుక కూడా మహేష్ బాబు సూపర్ స్టారే. ఇప్పటికే మహేష్ తెలుగు రాష్ట్రాల్లో రెండు పల్లెటూళ్లను దత్తత తీసుకుని సొంత ఖర్చుతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం చేస్తున్నారు.

అలాగే చిన్నారుల‌కి హార్ట్ ఆప‌రేష‌న్స్ చేయిస్తూ వారి కుటుంబాల‌లో ఆనందం నింపుతున్నారు. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో హెల్త్ చెకప్‌లు నిర్వహించడమే కాకుండా అవ‌స‌ర‌మైన వారికి స‌ర్జ‌రీలు కూడా చేయిస్తూ.. ఇప్పటికి గుండె సంబంధిత వ్యాధుల‌తో బాధ ప‌డుతున్న వారికీ హార్ట్ స‌ర్జ‌రీలు చేయిస్తుంటాడు.

ఇప్పటికే మూడున్నరేళ్లలో వెయ్యి మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్‌ చేయించిన మహేశ్.. తాజాగా ఓ చిన్నారికి గుండె ఆపరేషన్‌ చేయించారు. దీనిపై మహేశ్‌ భార్య నమ్రతా శిరోద్కర్‌ స్పందించారు.

ఆంధ్రా హాస్పిటల్స్‌ వారి సహకారంతో ఎంబీఫర్‌సేవింగ్‌హార్ట్స్‌ కార్యక్రమంలో భాగంగా తనుశ్రీ అనే పాపకు గుండె ఆపరేషన్‌ జరిగిందని, తను సేఫ్‌గా ఉందని తెలిపారు నమత్ర. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురాం పెట్ల దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.

Tags :

Advertisement