Advertisement

  • మరో ఇద్దరు చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించిన సూపర్ స్టార్ మహేష్ ...

మరో ఇద్దరు చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించిన సూపర్ స్టార్ మహేష్ ...

By: Sankar Sun, 18 Oct 2020 8:32 PM

మరో ఇద్దరు చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించిన సూపర్ స్టార్ మహేష్ ...


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు బయట కూడా రియల్ హీరో అని చాల సార్లు నిరూపించుకున్నారు..ఎందరో చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయించి వారికి పునర్జన్మను అందించాడు..తాజాగా మ‌రో ఇద్ద‌రు చిన్నారులకు ప్రాణదానం చేసి రియ‌ల్ హీరో అనిపించుకున్నారు. ఈ విష‌యాన్ని మ‌హేశ్ స‌తీమ‌ణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియ‌జేశారు.

"మ‌రో రెండు గుండెలు మాతో క‌లిశాయి. ఇటీవ‌లే గుండె శస్త్రచికిత్స చేయించుకున్న ఇద్ద‌రు చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అందుకు సంతోషంగా ఉంది. ఇందుకు స‌హ‌కారం అందించిన ఆంధ్రా హాస్పిట‌ల్స్‌కు ధ‌న్య‌వాదాలు" అని రాసుకొచ్చారు. దీనిపై మ‌హేశ్ అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తూ.. "దేవుడు మా మ‌హేశ్" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా మ‌హేశ్‌బాబు ఇలా సాయం చేసింది.. ఒక్క‌రికో, ఇద్ద‌రికో కాదు, గుండె సంబంధిత వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వెయ్యి మందికి పైగా చిన్నారుల‌కు హార్ట్ స‌ర్జ‌రీలు చేయించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. భ‌విష్య‌త్తుపై ఆశ‌ను వ‌దిలేసుకున్న చిన్నారుల‌ను కాపాడి ఆ పేద కుటుంబాల్లో ఆశాజ్యోతిని వెలిగిస్తున్నారు. ఈ మంచి ప‌ని కోసం మ‌హేశ్‌ కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల‌తో క‌లిసి ప‌ని చేస్తున్నారు. సోష‌ల్ మీడియా విన్న‌పాల‌తో పాటు, వివిధ గ్రామాల్లో క్యాంపులు నిర్వ‌హించి అవ‌స‌రం ఉన్న‌వాళ్ల‌ను గుర్తించి వైద్య స‌హాయం అందిస్తున్నారు

Tags :
|

Advertisement