Advertisement

  • హరీష్ శంకర్ , సునీల్ కాంబోలో కొత్త సినిమా 'వేదాంతం రాఘవయ్య'

హరీష్ శంకర్ , సునీల్ కాంబోలో కొత్త సినిమా 'వేదాంతం రాఘవయ్య'

By: Sankar Mon, 31 Aug 2020 5:32 PM

హరీష్ శంకర్ , సునీల్  కాంబోలో కొత్త సినిమా 'వేదాంతం రాఘవయ్య'


కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సునీల్. ఆతర్వాత హీరోగా మారి అలరించాడు. అయితే హీరోగా పెద్దగా రాణించలేకపోవడంతో తిరిగి కమెడియన్ గా మారాడు. ఇటీవల 'కలర్ ఫోటో' సినిమాలో విలన్ పాత్రలో నటించాడు సునీల్.

తాజాగా మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సునీల్. 'వేదాంతం రాఘవయ్య' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. మాస్ దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాకు కథ, మాటలను అందిస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాను హరీష్ శంకరే నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాను 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను హరీష్ శంకర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తారనేది తెలియాల్సి ఉంది. గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిన హరీష్ శంకర్ ఇటీవలే వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ సినిమా హిట్ కొట్టి మంచి ఊపు మీద ఉన్నాడు..

Tags :
|

Advertisement