Advertisement

  • అంగరంగ వైభవంగా సుల్తాన్ డైరెక్టర్ పెళ్లి...!

అంగరంగ వైభవంగా సుల్తాన్ డైరెక్టర్ పెళ్లి...!

By: Anji Thu, 29 Oct 2020 1:50 PM

అంగరంగ వైభవంగా సుల్తాన్ డైరెక్టర్ పెళ్లి...!

తమిళ్ డైరెక్టర్ సుల్తాన్ ఫేమ్ బ‌క్కియ‌రాజ్ క‌న్న‌న్ ఓ ఇంటివాడు అయ్యాడు. లూర్‌లోని సెవూర్‌లో ఆశ అనే అమ్మాయిని క‌న్న‌న్ వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక‌లో శివ‌కార్తికేయ‌న్‌తో పాటు సుల్తాన్’ నిర్మాత ఎస్.ఆర్. ప్రభు, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

సుల్తాన్ చిత్ర బృందం కార్తీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను వివాహ వేదిక‌పై ఆవిష్క‌రించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. నూత‌న వ‌ధూవ‌రుల‌కు సుల్తాన్ హీరో కార్తీ త‌న ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు అందించారు. బ‌క్కియ‌రాజ్‌, ఆశ‌ల జీవితం ఆనందంగా ఉండాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాను.

ఒక‌రిపై ఒక‌రికి న‌మ్మ‌కం, అర్ధం చేసుకోవ‌డం ఉండాల‌ని కోరుకుంటున్నాను అని కార్తీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. బ‌క్కియ‌రాజ్‌ ప్రస్తుతం కార్తీ తో ‘సుల్తాన్’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే 90 శాతం షూటింగ్ ముగిసింది.

రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ మూవీ ని ఓటిటి లో రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రముఖ ఓటీటీ సంస్థతో భారీ డీల్ సెట్ చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Tags :
|

Advertisement