Advertisement

మంజు వారియర్ పాత్రలో సుహాసిని ..?

By: Sankar Tue, 23 June 2020 12:49 PM

మంజు వారియర్ పాత్రలో సుహాసిని ..?



మలయాళం లో మోహన్ లాల్ హీరోగా , వివేక్ ఒబెరాయ్ , మంజు వారియర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం లూసిఫర్ ..మోహన్ లాల్ అద్భుత నటనతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ..ఇందులో మోహన్ లాల్ పాత్ర పవర్ఫుల్ గా ఉంటుంది ..ఇలాంటి పవర్ ఫుల్ పాత్రను తెలుగులో చిరంజీవికి అయితే బాగుంటుంది అని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ లూసిఫెర్ రీమేక్ హక్కులను తీసుకున్నాడు ..తెలుగులో సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించనున్నాడు ..

అయితే ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్రకు సమానంగా మంజు వారియర్ పాత్ర కూడా ఉంటుంది ..మోహన్ లాల్ ను అసహ్యించుకునే పాత్రలో అద్భుతంగా నటించింది ..మరి అంత ప్రాధాన్యత ఉన్న పాత్రను తెలుగు లో ఎవరు చేయనున్నారు అని అందరిలో ఆసక్తి నెలకొన్నది ..అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సుహాసిని అయితే ఆ పాత్రకు కరెక్ట్ గా సెట్ అవుతుంది అని చిత్ర యూనిట్ భావిస్తోంది అంట .. అయితే చిరంజీవి పక్కన హీరోయిన్‌గా నటించిన సుహాసిని.. ఇప్పుడు అక్కగా చేసేందుకు అంగీకరిస్తుందా? అనే అనుమానాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.

చిరంజీవి , సుహాసిని హీరో హీరోయిన్లుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు ..ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం కూడా ఉంది ..మరియు ఆ పాత్ర ప్రాధాన్యత కూడా చాలా ఉంది కానీ హీరో హీరోయిన్లుగా చేసిన వీళ్లిద్దరు అక్క తమ్ములుగా నటిస్తారా అనేది అనుమానమే ..అందులోనూ చిరంజీవి క్యారెక్టర్ ను అసహ్యించుకునే అక్క క్యారెక్టర్ లో నెగటివ్ పాత్రలో సుహాసిని నటిస్తారో లేదో తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాలి ..కానీ ఆ పాత్ర సుహాసిని చేస్తే మాత్రం ఆ పాత్రకు నిండుదనం వస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు

Tags :
|

Advertisement