Advertisement

  • కొత్త సినిమాను ప్రకటించిన స్టైలిష్ స్టార్ ..డైరెక్టర్ ఎవరో తెలిస్తే అభిమానులకు పూనకాలే..

కొత్త సినిమాను ప్రకటించిన స్టైలిష్ స్టార్ ..డైరెక్టర్ ఎవరో తెలిస్తే అభిమానులకు పూనకాలే..

By: Sankar Sat, 01 Aug 2020 08:59 AM

కొత్త సినిమాను ప్రకటించిన స్టైలిష్ స్టార్ ..డైరెక్టర్ ఎవరో తెలిస్తే అభిమానులకు పూనకాలే..



ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన అలా వైకుంఠపురం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ..ఇక అదే ఊపులో వరుసగా సినిమాలను లైన్ లో పెడుతూ అభిమానులను ఆనందపెడ్తున్నాడు ..ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న అల్లు అర్జున్ .. నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌పై ప్రకటన వచ్చేసింది.

కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ తన 21వ చిత్రం చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. ‘నా తదుపరి చిత్రం కొరటాల శివ గారితో ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. కొంతకాలంగా నేను దీని కోసమే ఎదురుచూస్తున్నాను. సుధాకర్‌ గారి మొదటి ప్రాజెక్టుకు నా శుభాకంక్షలు. శాండి, స్వాతి, నట్టి ఇది మీ పట్ల నాకున్న ప్రేమను చూపించే మార్గం. కాగా, ఈ చిత్రంతో సుధాకర్‌ మిక్కిలినేని నిర్మాతగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. యువ సుధా ఆర్ట్స్‌, జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శాండీ, స్వాతి, నట్టీలు సహా నిర్మాతలుగా వ్యవహరించనున్నారు..

ఇక, బన్నీ-వేణు శ్రీరామ్‌ కాంబినేషన్‌లో దిల్‌ రాజు నిర్మాతగా ‘ఐకాన్‌-కనబడుటలేదు’ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. బన్నీ కేరీర్‌లో 21వ చిత్రంగా ఇది తెరకెక్కనున్నట్టుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఈ చిత్రం గురించి టాక్‌ వినిపించలేదు. అయితే ఈ ఏడాది బన్నీ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం పేరు మరోసారి తెరమీదకు వచ్చింది. ఆయనకు విషెస్‌ చెబుతూ ఐకాన్‌ టీమ్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే తాజాగా కొరటాల సినిమాకు బన్నీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఐకాన్‌ మూవీ మరింత ఆలస్యం కానున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కొరటాల శివ మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఆచార్య మూవీని తెరకెక్కిస్తున్నారు.

Tags :

Advertisement