Advertisement

  • అందరు ఊహించినట్లే బిగ్ బాస్ సీజన్ -4 హోస్ట్ గా మళ్ళీ ఆయననే..

అందరు ఊహించినట్లే బిగ్ బాస్ సీజన్ -4 హోస్ట్ గా మళ్ళీ ఆయననే..

By: Sankar Sat, 01 Aug 2020 3:32 PM

అందరు ఊహించినట్లే బిగ్ బాస్ సీజన్ -4 హోస్ట్ గా మళ్ళీ ఆయననే..



టివి షో లలో బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ..దేశంలో ఇప్పటిదాకా నడుస్తున్న అన్ని భాషల్లో ఈ బిగ్ బాస్ షో భారీ క్రేజ్ ను సాధించింది ..తెలుగులో కొంచెం లేట్ గానే ప్రారంభం అయినప్పటికీ తెలుగు లో కూడా ఈ షో సూపర్ హిట్ అయింది ..ఇప్పటికే మూడు సీజన్లు తెలుగు లో కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ షో నాలుగవ సీజన్ కోసం సమాయత్తం అవుతుంది ..ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్నారు ..అయితే నాలుగవ సీజన్ కు సంబంధించి ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయింది ..

ఈ నేప‌థ్యంలో అస‌లు బిగ్‌బాస్‌ సీజన్‌-4కుహోస్ట్ ఎవ‌రు ఉంటారన్న దానిపై ర‌క‌రకాల వార్త‌లు ప్ర‌చారంలో వచ్చాయి. వీట‌న్నింటికి తెర‌దించుతూ బ్యాక్ ఆన్ ది ఫ్లోర్ విత్ లైట్, కెమెరా యాక్ష‌న్ అంటూ నాగార్జున ఓ ట్వీట్ చేశారు. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభ‌మ‌వుతుంద‌ని, వ్యాఖ్యాత‌గా నాగార్జున వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు స్టార్‌మా సైతం ప్ర‌క‌టించింది.

బిగ్‌బాస్ 3 వ్యాఖ్యాత‌గా నాగార్జున త‌న‌దైన శైలిలో షోను ఆసాంతం ర‌క్తి క‌ట్టించారు. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ చేయ‌నున్నారు. బిగ్‌బాస్ సీజ‌న్ 4 హోస్ట్‌గా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ.. నిర్వాహకులు మాత్రం నాగార్జున వైపే మొగ్గు చూపారని సమాచారం. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా షూటింగ్‌ చేయడం అనేది నిర్వహకులు సవాలుతో కూడుకున్న పనే. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఫిజికల్‌ టాస్క్‌లు లేకుండా.. షోను డిఫరెంట్‌గా ఏమైనా ప్లాన్‌ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు బిగ్‌బాస్ సీజ‌న్-4లో కంటెస్టెంట్‌లు ఎవ‌రన్న దానిపై ఆస‌క్తి నెలకొంది

Tags :
|

Advertisement