Advertisement

‘ఐనా ఇష్టం నువ్వు’ - కీర్తి సురేష్

By: Anji Mon, 14 Sept 2020 3:43 PM

‘ఐనా ఇష్టం నువ్వు’ - కీర్తి సురేష్

ఇప్పుడు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌ ‘నేను శైలజ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సినిమా కంటే ముందే ఆమె సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయకృష్ణ హీరోగా ‘ఐనా ఇష్టం నువ్వు’ అనే సినిమాకు సంతకం చేసింది. ఆ సినిమా చిత్రీకరణలోనూ పాల్గొంది. ఈ చిత్రం దాదాపు పూర్తి కావచ్చిన దశలో ఏవో కారణాల వల్ల ఆగిపోయింది. ఈలోపు ‘నేను శైలజ’ విడుదలై కీర్తికి టాలీవుడ్లో మంచి ఆరంభాన్నిచ్చింది.

ఆ తరువాత ‘నేను లోకల్’తో మరో హిట్ ఖాతాలో వేసుకున్న కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ అయింది. ‘మహానటి’తో తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సాధించిన ఆమె జాతీయ అవార్డు సైతం అందుకుంది. ఇప్పుడు కీర్తి రేంజే వేరు. ఇలాంటి సమయంలో ‘ఐనా ఇష్టం నువ్వు’ సినిమా మళ్లీ తెరపైకి వచ్చింది. మిగిలిన కొంత చిత్రీకరణ పూర్తి చేసి దీన్ని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.

కీర్తి మీద కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉండగా.. ఇప్పుడు తానున్న స్థాయికి ఆ సినిమా చాలా చిన్నదైనా సరే కీర్తి ఆ సీన్స్ పూర్తి చేయడానికి సరే అందట. నాలుగైదు రోజుల ప్యాచ్ వర్క్ మిగిలుందని, కీర్తి మీద మిగతా సన్నివేశాలు తీసి ఫస్ట్ కాపీ రెడీ చేస్తామని, థియేటర్లు తెరుచుకున్నాక సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాత చంటి అడ్డాల తెలిపాడు. రామ్ ప్రసాద్ రౌతు ఈ చిత్రానికి దర్శకుడు.

Tags :

Advertisement